సినీపాటకు పరిపుష్టతను ఇచ్చిన ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర

తెలుగు సినీ స్వర్ణయుగంలో సముద్రాల, పింగళిగార్ల తర్వాత చెప్పుకోదగ్గవారు తెలుగు సినీపాటకు పరిపుష్టతను చేకూర్చిన వారు ఆచార్య ఆత్రేయ, ఆరుద్రలు. ఒకరు గోత్రమైతే, మరొకరు నక్షత్రం. తమ ఒంటిపేర్లకంటే, గోత్ర, నక్షత్ర నామాలతోనే సినీ వినీలాకాశంలో ప్రకాశించిన కవులు వీరు. సాహిత్య విలువలు కలిగి, మాధుర్య ప్రధానమైన పాటలు తెలుగు శ్రోతలను అలరారిస్తున్న 50, 60 దశకంలో వీరివురు సందర్భోచితంగా, పాత్రోచితంగా పాటలను రాసి అందరిని మెప్పించారు.

చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయగారు ఆయనకు ఆయనే సాటి. పదాలు చిన్నవైనా తరచి చూస్తేగాని, వాటి లోతుల్లోకి తొంగి చూస్తేగాని ఆ పదాల్లో ఇమిడివున్న, దాగివున్న తాత్విక జ్ఞానం, జీవిత సత్యాలు మనసుకు పట్టవు. శ్రీశ్రీగారి చేత ఇతను ‘ఆరుద్ర’ కాడు, ‘ఆరో రుద్రుడు’ అని మెప్పుపొందిన బహుముఖప్రజ్ఞాశాలి ఆరుద్ర. అంత్యప్రాసలే తన చేవ్రాలుగా సినీసాహితీ ప్రపంచంలో తనదంటూ ఒక ముద్రను వేశారు.

ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర…

https://www.thetageethi.org/wp-content/uploads/2026/05/-ఆరుద్ర-e1778145453217.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *