వ్యాసాలు

వ్యాసాలు

సృష్టి, స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి అంశాలు అనేక శక్తి ప్రధాన క్షేత్రాలలో శక్తిపీఠాలుగా విశిష్టతను సంతరించుకున్నాయి. శివపురాణం మనకు ఈ శక్తిపీఠాల ఆవిర్భావ కథను తెలుపుతోంది. బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడు.....
సినిమా పాటలు అనగానే మనకు ప్రణయ గీతాలే గుర్తుకువస్తాయి. సినిమా పాటల్లో అధికశాతం ప్రేమగీతాలే. అందులో సందేహం లేదు. అయితే, ప్రేమగీతాలతో పాటు భక్తి గీతాలు, విషాద గీతాలు, ప్రభోదాత్మక గీతాలు, హాస్య గీతాలు, దేశభక్తి గీతాలు కూడా విరివిగానే మన సినిమాల్లో విన్పిస్తాయి. దేశభక్తిని ప్రబోధిస్తూ సినిమాకవులు శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, సినారె రాసిన గ.....
నాగమల్లి కోనలోన… నక్కింది లేడికూన, ఎరవేసి..హ…గురి చూసి…హ… పట్టాలి మామా.. అంటూ హూషారెక్కించే, కైపెక్కించే, మధురమైన ఈ పాటను పాడిన గాయని ఎవరు? అని నేటి తరాన్ని ప్రశ్నిస్తే, తడబడతారు. ఈ పాట పాడింది కె. జమునా రాణిగారు. సినీ సంగీత స్వర్ణయుగానికి చెందిన ఒక్కొక్కగాయని నిష్క్రమిస్తుంటే, ఆ లోటు తీర్చే గాయకులు ఇకమీద పుడతారా అనిపించకమానదు. న.....
‘భాష’ అంటే భావాన్ని వ్యక్తం చేసేది. అలాంటి అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మ నీటిలో ఉన్ననాటిది. అది మన పుట్టకతో మొదలవుతుంది. మనం గిట్టినా అనంత విశ్వంలో విహరిస్తూనే ఉంటుంది. ‘జో అత్యుతానంద, జోజో ముకుందా’ అని లాలిపాట పాడినా, ‘చందమామరావే, జాబిల్లిరావే’ అని పసిపాపలకు బువ్వ తినిపించినా, ‘వీరి, వీరి గుమ్మడిపండు వీరిపేరేమి’ అంటూ ఆటలు ఆడినా, ‘తారంగ.....
సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు దశాబ్దం కిందట తన సినీగీతాల ప్రస్థానం గురించి, తాను రాసిన పాటల భావార్థాలను వివరిస్తూ ‘సిరివెన్నల తరంగాలు’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో సినీ పాట, కవుల ఔనిత్యాన్ని గురించి శాస్త్రిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలను మా పాఠకుల కోసం అందిస్తున్నాం. సినిమా పాటకి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో, అంతకం.....
తెలుగు భాషకు గర్వంతో చెప్పుకోగల స్థాయిలో సాహిత్యముంది. ఆ తెలుగు సాహిత్య చరిత్రలో వేమన్న ఒక ధృవతార.తన కాలం నాటి మనుషుల కన్నా ముందు చూపు ప్రదర్శించగలిగిన వాళ్లే కవులు.దానినే ‘రవి గాంచనిచో కవి గాంచు’ నని సిద్ధాంతీకరించారు కవులు.తన సమకాలీన కవులకంటే కూడా ముందుచూపు కలిగిన వాడు వేమన. వేమన కవులకే కవి. వేమన ప్రదర్శించిన ముందు చూపుకు గల క.....
ఆంధ్రులకి, ఆవకాయకి అవినాభావ సంబంధం ఉందంటే అతిశయోక్తి కాదేమో. ఆవకాయ మీద పద్యం రాయని కవి, కార్టూన్ గీయని చిత్రకారుడు, కథలు రాయని రచయిత, ఇక ఆవకాయ బద్ద జుర్రని ఆంధ్రుడు తెలుగు గడ్డమీద పుట్టుడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, వేసవికాలం ఆవకాయ పెట్టని తెలుగువాడుండు. అన్నప్రాసననాడే ఆవకాయ కోరేది మన తెలుగువాడొక్కడేనేమో. అలాంటి ఆవకాయ మీద గరికపాటి న.....
ఈ బొమ్మ నేను, నా పేరు బుడుగు. ఇంకోపేరుంది పిడుగు… ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు…. అంటూ తెలుగువారందరిని నవ్వించి, కవ్వించిన బుడుగు జ్ఞాపకం ఉన్నాడా? వాడితోపాటు అల్లరి చేసిన సీ.గానపెసూనాంబ, వాడి అల్లరికి బలైన పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు? టీచర్లు? పోనీ, . అలో… అలో… లో…జోగ.....
ఆస్ట్రేలియా వచ్చి పది వసంతాలు దాటిందని తల్చుకుంటే, ఒళ్ళు గగుర్పోడుస్తుంది. మొట్టమొదటిసారి పెర్త్ విమానాశ్రయంలో కాలిడిన నాటి సంఘటనలు కళ్ల ముందు రింగులు తిరుగుతూ జ్ఞాపకాల ఒడిలోకి చేరుస్తున్నాయి. పుట్టినాటి నుంచి ఆంధ్రావని వాకిట ఆటలాడి ఒక్కసారిగా మరో దేశానికి వలస పక్షుల్లా చేరటం తలుచుకుంటే సాహసమే అనక తప్పదు. విమానాశ్రయం ముంగిట ని.....
మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం. ప్రతి సంవత్సరం ఇది వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇందులో కొత్తగా విశేషం ఏముంది అని మీరనుకుంటున్నారా? మీరనుకుంటున్నది నిజమే అందులో ఎటువంటి విశేషం లేదు. ఎన్ని దినోత్సవాలు జరుపుకున్నా సమాజంలో మార్పనేది ఏమీ లేదు. కానీ నాకు మాత్రం మహిళాదినోత్సవాలతో, మహిళా కమిషన్తో జర్నలిస్టుగా అనుబంధం ఉంది. 90వ దశకం.....
మేము ఆస్ట్రేలియాకు వచ్చిన కొత్త. ఇంకా ఇక్కడి సంస్కృతికి, అలవాట్లకి, పద్దతులకి అలవాటు అవుతున్న సమయం. అలాగే, బ్లాగులు రాజ్యమేలుతున్న సమయం. రాయటం అనేది ఒకసారి అలవాటయ్యాక, మనసు ఊరుకోదు. ఏదో ఒక విషయంపై చర్చించాలనే కోరుకుంటుంది. ఇక రచనా వ్యాసాంగంలో ఉన్న వారికైతే, మస్తిష్కంలో మెదిలిన విషయాలకి అక్షరరూపం ఇచ్చేదాక మనసు ఊరుకోదు. అలా నేను కూడా త.....
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 1.9బిలియన్ జనాభా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ శత విధాల ప్రయత్నిస్తుంటారు. మనిషికో జిహ్వ, పుర్రెకో బుద్ధి అన్నట్టుగా, ప్రతీ మనిషి తనకు తోచిన విధంగా, మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సైజ్ జీరోపై మోజో, నిజంగానే తమ .....