తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు 5 కాంతం
18 Dec 2020

ఆమె నవ్విస్తుంది. కవ్విస్తుంది. చక్కిలిగింతలు పెడుతుంది.ఆలోచింపచేస్తుంది. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తుంది కూడా. అది ఆమెకు మాత్రమే సొంతమైన జీవనసరళి. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి. ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు కాంతం కన్పిస్తుంది. క..

18 Dec 2020

గురజాడ వారి కలం నుండి నేలరాలిన చుక్కే మధురవాణి. వృత్తిపరంగా వేశ్య అయినప్పటికి ఉన్నతమైన వ్యక్తిత్వంతో, కొంటెతనంతో, మాటకారితనంతో, జాణతనంతో నాటి, నేటి సమాజంలో మంచికి, చెడుకి మధ్య ఆనకట్టుగా నిలిచే అందాల భరిణే. కాదు, కాదు విచక్షణతో వ్యవహరించే ధీర వనిత. మంచివాళ్ల పట్ల మంచిగానూ, చెడ్డవాళ్లపట్ల చెడ్డగానూ ఉండమన్న తల్లి బోధనను అక్షరాలా అమలు ప..

18 Dec 2020

అష్టాదశపురాణాలను జాతికి అందించిన వ్యాసభగవానుడు దాదాపు లక్ష శ్లోకాలలో రచించిన భారతం – సీ. ‘‘ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని యధ్యాత్మవిదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని, కవి వృషభులు మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని యైతిహాసికులితిహాసమనియు బరమ పౌరాణీకుల్ బహు పురాణముచ్చ యంబని మహిగొనియాడుచుండ..

18 Dec 2020

ఆ మాట అనగానే మనముందు గయ్యాళి సూర్యాకాంతం రూపం దర్శనమిస్తుంది. అది మన తప్పుకాదు. పరిస్థితుల ప్రభావం. అత్తగారనగానే కోడళ్లని వేపుకు తినే పాత్రలే మన మనసులో మెదలుతాయి గాని, “దొంగలెవరో, దొర్లెవరో మనకెట్లా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే, నల్లగా నాపరాళ్లలాగ, పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటినిండా నూనెరాసుకుని, దొంగతనాల..

18 Dec 2020

తెలుగు నాటక సాహిత్యంలో సింగరాజు లింగరాజు ఒక విలక్షణమైన పాత్ర. భారతీయ సాహిత్యంలోనే ఒక అపూర్వ సృష్టి. స్వార్ధం, లౌక్యం, పిసినిగొట్టుతనం కలబోసుకుని పుట్టిన పాత్ర. ‘ధనం మూలం మిదమ్ జగత్తు’ అనే సూత్రానికి భాష్యకారుడు అతనే! లింగరాజుకు డబ్బే సర్వస్వం! ఈ చరాచర ప్రపంచంలో ప్రతి వస్తువునూ డబ్బు అనే కళ్లద్దాల ద్వారానే చూస్తాడు ఆ మహానుభావుడు. అత..

18 Dec 2020

పిల్లలకు పేరుపెట్టడం అంటే, అదో మహాయుద్ధం. ఫ్యాషన్ గా పేర్లుపెట్టడం, బారసాలనాడు ఒక పేరు రాసి, తర్వాత వాడకానికి మరో పేరు పెట్టుకోవడం, ఇంట్లో ఒకటి, వీధిలో ఒకటి, సర్టిఫికెట్టుల్లో ఒకటి, పెళ్ళికార్డులో మరోకటి, ఇంక ముద్దుపేర్లు, అమ్మమ్మ, తాతయ్య పేర్లు, ఇలవేల్పుల పేర్లు, జ్యోతిష్యానికి అనువైన పేర్లు, పలకలేక కుదించేసుకున్న పేర్లు ఇలా బారసాలన..

18 Dec 2020

చందమామ! వినీల ఆకాశంలో ఎక్కడో ఉన్న చందమామను చూపి పిల్లలకు గోరుముద్దలు తిన్పించే తల్లులు నేడు కూడా మన ఆంధ్రదేశంలో ఉన్నారు. చల్లని జాబిలిని చూస్తూ గోరుముద్దలు తినని వారు మనలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో! అలాగే చదవడం నేర్చిన నాటినుండి ఒక్కసారైనా చందమామ బాలల పత్రికను చదవని వారూ ఉండరు. బాలల సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపా..

18 Dec 2020

భాషా సంపర్కము కీడెంత చేసిందన్న విషయాన్ని పక్కన పెడితే, కవులను, భావుకలను విశేషంగా ప్రభావితం చేసిందనటంలో సందేహంలేదు. ఆంగ్ల సంపర్కంతో ఆంధ్ర సారస్వతం కూడా కొంతపుంతలు తొక్కాలని భావించి రచనలు చేసినవారిలో తాపీ ధర్మారావుగారు ప్రముఖలు. ఇంగ్లీషులో ఉన్న అనేక వాఙ్మయశాఖలు మన భాషలో కనపడవు. కాబట్టి మన రచనలలను కొత్త పుంతలు తిప్పాలని ఆయన అనేక ప్..