తొలిరోజుల్లో రంగస్థలంపై ప్రజాదరణ పొందిన పాటలు, పద్యాలు, బాణీలను సినిమాల్లో చొప్పించేవారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలం, పసుమర్తి యజ్ఞ నారాయణశాస్త్రి, కొప్పరపు సుబ్బారావు, చందాల కేశవదాసు వంటి రంగస్థల ప్రముఖుల పాటలు సినిమాల్లో ఎక్కువగా విన్పించేవి. సముద్రాల రాఘవాచార్య, పింగళి నాగేంద్రరావుల ప్రవేశంతో తెలుగు పాట కొత్త నడకలు నేర్చింది. వ్యావహారశైలిని పొదవుకుని ముందుకు నడిచింది. సినీ సాహిత్యంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది.
పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా తెలుగు సినీ పాటకు ఒరవడి దిద్ది రాబోవు తరాలకు మార్గదర్శకులైన సముద్రాల రాఘవచార్యులగారు, అతి సులువైన పదాలతో రాసిన పాటలు, సృష్టించిన మాటలు ప్రజల మనసులో, తెలుగువారి పెదాలపై నిలిచే పాటలను అందించిన పింగళి నాగేంద్రల సినీ సాహిత్యాన్ని విని ఆనందించండి.
తొలితరం రచయితలు – సముద్రాల, పింగళి..
