
తనయునికిని పరదేశికి
పెనిమిటికిని నొక్కరీతి విం దిడియెడు వా
వనితను పుణ్యాంగన యని
ఘనులందురు కుందవరపు కవి చౌడప్పా
భావం: భోజనం దగ్గర పంక్తిలో ఫలభేదం చేయకూడదంటారు. తన కొడుక్కు, అతిథికి, భర్తకు ఒకే విధంగా వడ్డించే వనితను పుణ్యాత్మురాలంటారు.
...

సీ. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు
ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు
కనకమిమ్మని చాల గష్టపెట్టలేదు
పల్లకిమ్మనినోటఁ బలుకలేదు
సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు
భూములిమ్మని పేరు పొగడలేదు
బలము నిమ్మని నిన్ను బతిమాలగా లేదు
పనుల నిమ్మని పట్టు పట్టలేదు
తే. నే గోరిన దొక్కటే నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చినఁ చాలునాకు
భ.....

వెలకాంత లెందరైనను
కులకాంతకు సాటిరారు కువలయ మందున్
పలు విద్య లెన్ని నేర్చిన
కుల విద్యకు పాటిరావు గువ్వల చెన్నా.
భావం: వేశ్యలెంతమంది ఉన్నా, తన భార్యతో సమానంకారు. అలాగే ఎన్ని విద్యలు నేర్చినా కుల విద్యకు సాటిరాదు.
...

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నడు గల్గు భారతీ
భావం: తెల్లని కాంతులు వెల్లివిరిసే శరన్మేషు కందంబమూ, శారదచంద్రబింబమూ, పచ్చకర్పూరమూ, పటీరమూ, రాజహంసలు, జాజిచెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా, రెల్లుపూలు, ఆదిశేషుడూ, మల్.....

కలఁడంభోధిఁ, గలండు గాలిఁ, గలఁడాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గల, డీశుండు గలండు, తండ్రి వెదకంగా నేల నీ యా యెడన్
భావం: భగవంతుడైన విష్టువు లేనిచోటు విశ్వంలో లేదు. సముద్రంలో, ఆకాశంలో, అవని యందు అగ్నిలో, అన్నిదిశాల ఉన్నాడు. రాత్రియందు, పగటి యందు, సూర్య.....

అది సభయే ప్రియంబెసఁగ నార్యులు నిల్వరయేని నార్యులే
మదిఁదలపంగ వారలు సమంచిత ధర్మలు వల్కరేని, న
ట్టిదియును ధర్మువే తగ ఘటించి నిక్కము లేద యేనిఁ దా
బదిలపు నిక్కమే యొక నెపం బిడు చొప్పగునేని భూవరా.
భావం: పూజ్యులైన పెద్దలు ఏ సభలో ఉండరో, అది సభ యగునా? ఆలోచించగా ఆ సభలో నున్న పెద్దలు సముచితమైన ధర్మం చెప్పని పక్షంలో వారు ఆర్యులు కాగలరా? వారు చెప్ప.....

తుండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
భావం: పెద్దతొండం, తెల్లని ఒక దంతం, పెద్ద పొట్ట, ఎడమచేయి, అందంగా సవ్వడి చేసే గజ్జెలు, ప్రేమగా చూసే చూపులు, చిరునవ్వు, పొట్టి ఆకారం, కోరిన విద్యలను .....

భ్రమరధ్యానము దాల్చి కీటకము సద్భావాది సంయుక్తిదా
భ్రమరంభై ఖగవీధి నాడు ననిన, న్భావించి నిన్నాత్మనె
య్యముతో ధ్యానము సేయు మర్త్యుడును నీ యట్లే పరవ్యోమ త
త్త్వము నందవ్యయలీల నుండు టరుదే భావింప? సర్వేశరా
భావం: తుమ్మెద కీటకాన్ని తెచ్చి దాని గూటిలో పెట్టి భ్రమర శబ్దం చేస్తూ గూటి చుట్టూ తిరుగుతుంది. కొన్నాళ్లకు కీటకం భ్రమరమౌతుంది. అలాగే ని.....

దండమయా విశ్వంభర
దండమయా, పుండరీకదళనేత్ర హరీ
దండమయా, కరుణానిధి
దండమయా, నీకు నెపుడు దండము కృష్ణా
భావం: విశ్వాన్ని ధరించిన విశ్వాకారా, తెల్లని కలువ రేకుల వంటి కన్నులు కలిగిన వాడా, కరుణా సముద్రుడా, నీకెప్పుడు శతకోని నమస్కారములు కృష్ణా.
...

న యత్ర సూర్యోన విధుర్న వహ్ని
ర్నభిన్నతా న త్రిగుణావభాసః
చరంతమానందమయే మహిమ్ని
మృడం భజామో మృగితం మునీంద్రైః
భావం: సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రవేశింపని భిన్నత్వములేని, త్రిగుణములు లేని, ఆనందమయమైన మహిమోపేతమైన, స్థానమునందు వెలుగొందునట్టి, మునీంద్రులు అన్వేషించునట్టి శివుని భజించెదము.
...

కొడుకులు పుట్టరటంచు నేడ్తురవివేకు లీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెంపుత్రులు కాని ఆ శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడనే మోక్షపదంబు పుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వరా.
భావం: జీవితం మీద భ్రాంతి కలిగిన అవివేకులు కొందరు కొడుకులు పుట్టలేదని ఏడుస్తుంటారు. కాని కొడుకులు అనేకమంది పుట్టలేదా? కౌరవేంద్.....

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
తెల్లనికాకులును లేవు తెలియుము సుమతీ.
భావం: మంచితనం గల అల్లుడు, పండితుడైన శూద్రుడు, సత్యము చెప్పు ఆడది, పొల్లున తీసిదంచిన బియ్యము, తెల్లగా ఉండు కాకులు ప్రపంచమందు లేవు అని దీనర్థము.
...