పద్య సౌరభం

పద్య సౌరభం

న యత్ర సూర్యోన విధుర్న వహ్ని ర్నభిన్నతా న త్రిగుణావభాసః చరంతమానందమయే మహిమ్ని మృడం భజామో మృగితం మునీంద్రైః భావం: సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రవేశింపని భిన్నత్వములేని, త్రిగుణములు లేని, ఆనందమయమైన మహిమోపేతమైన, స్థానమునందు వెలుగొందునట్టి, మునీంద్రులు అన్వేషించునట్టి శివుని భజించెదము. ...
అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లనికాకులును లేవు తెలియుము సుమతీ. భావం: మంచితనం గల అల్లుడు, పండితుడైన శూద్రుడు, సత్యము చెప్పు ఆడది, పొల్లున తీసిదంచిన బియ్యము, తెల్లగా ఉండు కాకులు ప్రపంచమందు లేవు అని దీనర్థము. ...
అంతరంగమందు నపరాధములు చేసి మంచి వానివలెనె మనుసు డుండు ఇతరులరుగకున్న నీశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినురవేమ భావం: మనిషి తన మనస్సులో ఎన్నో దురాలోచనలు చేస్తూ ఎవరికి తెలియకుండా తెలివిగా తప్పించుకుంటాడు. సమాజంలో పెద్దమనిషిలా చెలామణీ అవుతుంటాడు. ఇతరులు తెలుసుకోకున్నా సర్వాంతర్యామి భగవంతుడు తెలుసుకోకుండా ఉంటాడా. ...
విద్య యొసఁగును వినయంబు వినయమునను బడయు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మంబు దానివలన నైహికాముష్మిక సుఖములందు నరుడు. భావం: విద్య వినయాన్ని, అణుకువను నేర్పుతుంది. వినయం వల్ల యోగ్యత కలుగుతుంది. యోగ్యత వల్ల ధనం లభిస్తుంది. ధనం వల్ల మంచి పనులు చేసే అవకాశాలు మెరుగవుతాయి. మంచి పనులు చేస్తే మనిషికి ఇహలోక, పరలోక సుఖాలు లభ్యమవుతాయి. ...
సలిలతరామనామజపసారమెరుంగను కాశికాపురీ నిలయుడగాను, మీ చరణనీరజరేణుమహాప్రభావముం తెలియ నహల్యగాను, జగతీవర, నీదగు సత్యవాక్యముం తలపగ రావణాసురుని తమ్ముడగాను, భవద్విలాసమున్ తలచి నుతింప నాతరమె? దాశరథీ కరుణాపయోనిధి భావం: నీ నామపారయణం చేత కలిగే శక్తి కాశీ విశ్వేశ్వరుడికి తెలియును. నీ పాదదూళి యొక్క మహిమ అహల్యా దేవికి తెలియును. నీ సత్యవాక్కులో.....
కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దోమ గజముగాదు దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వధాభిరామ వినురవేమ. భావం: ఎలాగైతే గొప్పదైనా కుక్క సాధు జంతువైన గోవు కాలేదో; భయంతో పారిపోయే కుందేలు పులికాలేదో; తొండం గల దోమ ఏనుగు కాలేదో, అదేవిధంగా పిసినిగొట్టు దాత కాలేడు. ...
దిక్కెవ్వరు ప్రహ్లాదకు దిక్కెవ్వరు పాండుసుతులకు దీనుల కెపుడున్ దిక్కెవ్వర య్యహల్యకు దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా భావం: పరమభక్తుడైన ప్రహ్లాదునకు, పాండవులకు, అహల్యకును ఎవరైతే రక్షకుడో ఆ కృష్ణుడే నాకును, మీకును రక్ష. ...
తరువు లతిరసఫలభార గురుతగాంచు నింగి వ్రేలును అమృత మొసంగు మేలు డుద్దతులు కోరు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకునిది సహజ గుణము భావం: జగత్తులో ఉపకార గుణం కలిగిన వారు ఫలాపేక్షలేకనే పనులు చేస్తారు. అది వారి సహజగుణం. చెట్లు తియ్యని ఫలాలని మోసి మనకందిస్తాయి. చంద్రుడు చల్లదనాన్ని ఆహ్లాదాన్నిచ్చే వెన్నెల కాయిస్తాడు. బుద్ధమంతులు లోక శ్రేయస్.....
సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరవ మొసంగు జనులకు కలుషమడుచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తిజేయు సాధుసంగంబు సకలార్ధ సాధనంబు భావం: సజ్జనులతో సాంగత్యం చేయడం అన్ని విధాల మంచిది. సత్యవంతుడుగా చేస్తుంది. బుద్దిబలాన్ని చేకూరుస్తుంది. గౌరవాన్నిస్తుంది. మనలోని లోపాలను పోగొడుతుంది. కీర్తి కలిగిస్తుంది. ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఒకటేమ.....
సీ. తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయిననాడు వెంటరాదు లక్షాధికారైనా లవణ మన్నమె కాని మెఱుగు బంగారంబు మ్రింగబోడు విత్త మార్జన జేసి విఱ్ఱవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి దానధర్మము లేక దాచి దాచి తే. తుగకు దొంగలకిత్తురో దొరల కవునో తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు? భూషణవికాస! శ్రీధర్మ పురని.....
తివిరి యిసుమను తైలంబు తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖల మనసు రజింపరాదు భావం: ఇసుకును పిండైనా సరే అతికష్టమ్మీద దానిలోంచి నూనె తీయవచ్చు. ఎండమావ్వుల్లోంచి నీళ్లు తాగవచ్చు. కావాలనుకుంటే లోకమంతా తిరిగి ఎక్కడైనా కుందేటి కొమ్ము సాధించవచ్చు. కాని మూర్ఖుని మనసు సంతోషపెట్టడం చాలా కష్టం. ...
నిక్కమైన మంచినీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్లు తట్టడేల చదువపద్యమరయఁ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ భావం: విలువలేని నీలమణి ఒక్కటైనా చాలు. విలువలేని రాళ్లు తట్టడైనా పనికిరావు. అలాగే రసవత్తరమైన పద్యం ఒక్కటైనా చాలు. భావశుద్ధిలేని పద్యాలు నిరర్థకమే కదా. ...