

మేము ఆస్ట్రేలియాకు వచ్చిన కొత్త. ఇంకా ఇక్కడి సంస్కృతికి, అలవాట్లకి, పద్దతులకి అలవాటు అవుతున్న సమయం. అలాగే, బ్లాగులు రాజ్యమేలుతున్న సమయం. రాయటం అనేది ఒకసారి అలవాటయ్యాక, మనసు ఊరుకోదు. ఏదో ఒక విషయంపై చర్చించాలనే కోరుకుంటుంది. ఇక రచనా వ్యాసాంగంలో ఉన్న వారికైతే, మస్తిష్కంలో మెదిలిన విషయాలకి అక్షరరూపం ఇచ్చేదాక మనసు ఊరుకోదు. అలా నేను కూడా త.....

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 1.9బిలియన్ జనాభా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ శత విధాల ప్రయత్నిస్తుంటారు. మనిషికో జిహ్వ, పుర్రెకో బుద్ధి అన్నట్టుగా, ప్రతీ మనిషి తనకు తోచిన విధంగా, మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సైజ్ జీరోపై మోజో, నిజంగానే తమ .....

మన భాషకు తెనుంగు, తెలుంగు, ఆంధ్రమని మూడు పేర్లు. తెలుగు భాష తేనెవలె తీయనైనది. పాశ్చాత్యులచే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని, దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణ దేవరాయలచే ప్రశంసించబడినది తెలుగు భాష. హిందీ భాష తరువాత రెండవ స్థానాన్ని ఆక్రమించి ప్రపంచములో తన ఉనికిని సుస్థిరము చేసుకోబోతున్న తెలుగు భాషకు కావ్య రూపమిచ్చి ప్రాణం పోసిన ఆదికవి నన్.....

తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండగలలో సంక్రాంతి ఒకటి. పుడిమి తల్లి పచ్చగా, పైరులు నిండుగా, ఇంటి నిండా ధాన్యం మెండుగా ఉండే ఈ సమయంలో కొత్త అల్లుళ్లు అత్త, మామల ఇళ్లకి రావటంతో సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలు తెచ్చింది తుమ్మెద అంటూ సందడిగా సంబారాలు జరుపుకుంటారు.
సంక్రాంతి లేదా సంక్రమణం. సూర్యుడు ధనుస్సురాశి నుండి మకరరాశిలోకి ప్రవే.....

తిలాపాపం తాల పిడెకుడు అన్నట్టు. ఇటీవల విడుదలైన పుష్పా-2 సినిమా సందర్భంగా హైద్రాబాద్ లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఈ విషయలో బాధ్యత ఎవరిది అన్న విషయంపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా వివాదం పెనుతుఫానుగా మారుతోంది. బందోబస్తు ఇవ్వని పోలీసులదా? వద్దన్నా థియేటర్ కు వచ్చిన హీరో అల్లు అర్జున్ దా? ప్రేక్షక.....

రచన: బులుసు సుబ్రహ్మణ్యం
‘‘తెలుగదలే యన్న’’ అంటూ మొదలు పెట్టి ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని శ్రీ కృష్ణదేవరాయల వారు ఓ పద్యం వ్రాశారాని విన్నాం. అంటే ఆ కాలంలో కూడా తెలుగు అదేలా? అనే వారున్నారని మనం అర్థం చేసుకోవాలని మా బండోడు వక్కాణించాడు. తెలుగు మీద ఇప్పుడు బోలెదు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్.....

కర్ణుడి చావుకి కారణాలు అనేకం. ఎన్నికల బరిలో నిలిచాక గెలుపు, ఓటములు సహజం. ఓడిపోయాక కారణాలు వెతుక్కోవటం కంటే, కారణాలు గ్రహించి, వాటిని సరిదిద్దుకునే వాడే రాజనీతిజ్ఞుడు అనవచ్చు. ఓటమిని అంగీకరించి హుందాగా వ్యవహరించటం అందరి వల్ల అయ్యే పనికాదు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంపే పెద్ద ఉదాహరణ. ఈ ఎన్నికలలో కూడా ఓడిపోతానే.....

అమెరికా అనేగానే అందరిలోనూ ఏదో ఆసక్తి. అక్కడ ఏం జరిగినా ఒక వింతే. ముఖ్యంగా భారతీయులకి అందునా తెలుగువారికి. ఇక అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలైతే చెప్పనే అక్కర్లేదు. అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ప్రభావం యావత్తు ప్రపంచ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే యావత్తు ప్రపంచం నవంబర్ 5 ఎన్నికల అనంతరం ఎవరు అమెరికా అధ్.....

దిబ్బు, దిబ్బు దీపావళి
మళ్లీ వచ్చే నాగులచవితి
అంటూ పిల్లల చేత దివిటీలు కొట్టిస్తూ, ఇల్లంతా దీపాలు అలంకరించి, మతాబులు, టపాకాయలు వెలిగిస్తూ సందడిగా సాగే దీపావళి పండుగ కోసం చిన్నా, పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. దీపావళి పదాన్ని విడదీస్తే దీప+ఆవళి అంటే, దీపాల యొక్క వరుస అని అర్థం. ఈ పండుగ చేసుకోవడానికి అనేక కథనాలు ప్రచారంల.....

చాలా రోజులైంది. పత్రికా విలేఖరిగా నా అనుభవాలను ముచ్చటించి. రోజూవారీ దైనందిక జీవితంలో సమయం మన చేతుల్లో ఉండదు. ఎన్నో విషయాలు పంచుకోవాలని ఉంటుంది. కానీ, ఒక దానికొకటి ఆలోచనలకు పొంతన దొరకదు. ఏదిఏమైనప్పటికి, చాలా రోజుల తర్వాత ఏ అనుభవాన్ని వివరించాలా అనుకుంటుంటే, నాకు రెండు విషయాలు తట్టయి. ఒకటి మేము ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో ఇండియా క్రికె.....

ఆస్ట్రేలియా వచ్చి పది వసంతాలు దాటిందని తల్చుకుంటే, ఒళ్ళు గగుర్పోడుస్తుంది. మొట్టమొదటిసారి పెర్త్ విమానాశ్రయంలో కాలిడిన నాటి సంఘటనలు కళ్ల ముందు రింగులు తిరుగుతూ జ్ఞాపకాల ఒడిలోకి చేరుస్తున్నాయి. పుట్టినాటి నుంచి ఆంధ్రావని వాకిట ఆటలాడి ఒక్కసారిగా మరో దేశానికి వలస పక్షుల్లా చేరటం తలుచుకుంటే సాహసమే అనక తప్పదు. విమానాశ్రయం ముంగిట ని.....

శ్రీశ్రీ ఛలోక్తులు ఆయన రాసిన కవిత్వం, వచనాలలాగా చాలా పదునైనవి. వాటికి గురైనవాడు నార్ల వారన్నట్లు గుడ్లనీరు కుక్కుకుంటాడు. పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు, ప్రశ్నలకు జవాబులు చెబుతున్నప్పుడు, లేఖలు రాస్తున్నపుడు… ఒకటేమిటి? అన్ని సందర్భాల్లోనూ శ్రీశ్రీ వాక్యం నవ్విస్తూనే చెళ్లుమనిపిస్తుంటుంది.
శ్రీశ్రీ నిశ్శబ్ధంలో హాస్యం చూడండ.....