వేమన పద్యం-1

వేమన పద్యం-1
వేమన పద్యం-1

అదిమి మనసు నిలిపి ఆనందకేళిలో
బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు
జిహ్వరుచులచేత జీవుండు చెడునయా
విశ్వదాభిరామ వినుర వేమ

భావం: మనస్సును నిలకడగా నిలిపి ఆనందపరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేక పోవడం వలన మనిషి చెడిపోతాడు.