భాగవత పద్యం-2

భాగవత పద్యం-2
భాగవత పద్యం-2

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కక్కండై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హ్యత్సరోరుహములన్ నానావిధానూనరూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁబ్రార్ధింతు శుద్ధుండనై

భావం: సూర్యుడు ఒక్కడే. అయినా లోకంలోని సకలజీవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కన్పిస్తాడు. అట్లే పరమాత్ముడు ఒక్కడే అయినా సర్వకాలాలలోనూ తాను సృష్టించిన నిఖిల ప్రాణుల హృదయకమలాలలో నానా రూపాలతో విలసిల్లుతున్నాడు. అలాంటి శ్రీహరిని నేను నిర్మలచిత్తుడనై ప్రార్ధిస్తున్నాను.