దాశరథీ శతకము 3

దాశరథీ శతకము 3
దాశరథీ శతకము 3

నీ మహనీయతత్త్వరస నిర్ణయబోధ కథామృతలబ్ధిలోఁ
దానునూగ్రుంకులాడక వృథాతను కష్టముజెంది మానవుం
డీ మహిలోక తీర్థముల నెల్లమునింగిన దుర్వికార హృ
త్తామపంకముల్ విడునె దాశరథీ కరుణాపయోనిధీ

భావం: నీ మహనీయమనెడి అమృతసాగరము నందు పూర్తిగా మునిగిపపోయినచో జ్ఞానము చేకూరును. మనస్సు నందలి మాలిన్యము నశించును. అంతేకాని శరీరమును కష్టపెట్టి తీర్థయాత్రలు చేసి ఎన్ని నదులలో మునిగిననూ, మనస్సు నంటియున్న చెడు భావనలు, బురద వదలిపోవుకదా.