కుమార శతకం 2

కుమార శతకం 2
కుమార శతకం 2

సరి వారి లోన నేర్పున
దిరిగెడి వారలకు గాక తెరువాటులలో
నరయుచు మెలిగెడి వారికి
పరు వేటికి గీడె యనుభవంబు కుమారా

భావం: నీతోటి వారితో మెలిగేటప్పుడు వారు మంచివారైనచో నీకును గౌరవము లభించును. ఆవిధంగాకాక దొంగబుద్ధి కలవారితో తిరిగినచో నీకును చెడు స్వభావము, అగౌరవము లభించును.