విదుర నీతి 1

విదుర నీతి 1
విదుర నీతి 1

మాలకరి పుష్పములు గోయు మాడ్కిఁ దేఁటి
పువ్వుఁదేనియఁ గొనియెడి పోల్కి నెదురు
గందకుండఁగఁ గొనునది కార్యఫలము
బొగ్గులకుఁ బోలె మొదలంటఁ బొడువఁజనదు.

భావం: ఎదుట వ్యక్తి నుండి ప్రయోజనం ఆశించినవాడు వానికి హాని కలగకుండా మృదువుగా ఆ ప్రయోజనాన్ని సాధించాలన్నదే ఈ పద్యం యొక్క ఉద్దేశం. పుష్పాలతో మాలలు తయారు చేసేవాడు పువ్వులను కోసినట్టు, తుమ్మెద పుష్పాల నుంచి తేనెను గ్రహించినట్టు, ఎదుటివానికి బాధ కలగకుండా కార్యాన్ని సాధించుకోవాలి. అంతేకాని బొగ్గులు కావాలనుకునేవాడు చెట్టును మొదలంటా నరికి నాశనం చేసినట్టుగా, కార్యాన్ని సమూలంగా నాశనం చేసి ఫలసాధనలో విఫలం కారాదు.

WhatsApp