మహాభారత పద్యం-1

మహాభారత పద్యం-1
మహాభారత పద్యం-1

ఆదిజుఁడైన బ్రహ్మ యుదయంబున కాస్పదమైనవాఁడు వే
దాది సమస్త వాఙ్మయములందుఁ బ్రశంసింతుఁడైనవాఁడు లో
కాది త్రిలోకపూజ్యుఁడని యాత్మ నెఱింగి పితామహూండు దా
మోదరుఁజెప్పెఁబూజ్యుడని యుక్తమ కాకిది యేమి దోసమే

బ్రహ్మదేవుని పుట్టుకకు స్థానమైనవాడు, వేదాలు మున్నగు సకల వాఙ్మయాలలో కీర్తింపబడినవాడూ, లోకానికంతటికి ఆది అయినవాడు, మూడులోకాలలో పూజింపదగిన శ్రీకృష్ణుడు పూజ్యుడు.