దాశరథీ శతకము - 1

దాశరథీ శతకము - 1
దాశరథీ శతకము - 1

జుఱ్ఱెదమీ కథామృతము, జుఱ్ఱెద మీపదకంజ తోయమున్
జుఱ్ఱెద రామనామమున బొబ్బిలుచున్న సుధారసంబు,నే
జుఱ్ఱెద జుఱ్ఱు జుఱ్ఱుఁన రుచుల్ గనువారి పదంబుగూర్బ వే
తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ

భావం: నీ కథలనే విని, నీ పాదపద్మములను కడిగిన నీటిని తాగెదను. నిత్యము నీయందె భక్తి నిలిపి నీ లీలల యందే నాధ్యాస నుంచి నీ భక్తుల తోనే నాకు సహవాస మొనర్చుము.