సిరివెన్నెల తరంగాలు....

సిరివెన్నెల తరంగాలు....
సిరివెన్నెల తరంగాలు....

సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు దశాబ్దం కిందట తన సినీగీతాల ప్రస్థానం గురించి, తాను రాసిన పాటల భావార్థాలను వివరిస్తూ ‘సిరివెన్నల తరంగాలు’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో సినీ పాట, కవుల ఔనిత్యాన్ని గురించి శాస్త్రిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలను మా పాఠకుల కోసం అందిస్తున్నాం.

సినిమా పాటకి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో, అంతకంతా ఒక విధమైన ‘తేలిక’ భావం కూడా ఉంది.

కవిత్వం వేరు. సినీ కవిత్వం వేరు. సినిమా పాటల్లో సాహిత్య విలువలు వెతకడం అంటే ‘నేతి బీరకాయలో నెయ్యి వెతకడంలాంటిది’ అని సారస్వత లోకంలో ఒక చిన్నచూపు.

‘పాతకాలం పాటల్లో ఉన్న మాధుర్యం, భావము, మృదుత్వం ఈ కాలం పాటల్లో లేవు. ఒకటే మోత. ఒకటే హోరు. ఒక్క ముక్క వినిపించదు. ఒకవేళ వినిపించినా, వినాల్సినంత విలువెనౖ ముక్కలు లేవు. ఏవో అవకతవక పలుకులూ, అసభ్వ కూతలూ తప్ప’ అని చాలా మందిలో నిరసన భావం.

‘బీట్. రిధిమ్, కిక్కు ఉండాలి గాని, బుర్ర తినేసే పొయట్రీ ఎవడిగ్గావాలి’ అని యువతరంలో పాటలోని ‘మాట’ పట్ల ఒక అవహేళన. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఒక పాటల రచయితగా మాత్రమే కాక, ఒక తెలుగువాడిగా, స్పందించే మనసున్న వాడిగా నాకు ఒక రకమైన కలవరం కలుగుతూ ఉంటుంది.

సినిమా పాట పట్ల సమాజంలో ఉన్న, ఈ నిరసనలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. కానీ కొంత అసహనం, ఉపేక్ష కూడా ఉన్నాయి. పిలల్లూ, పెద్దలూ, పామరులూ పండితులూ అంటూ ఏ భేధాలు లేకుండా, ఆబాలగోపాలాన్ని అల్లుకుంటూ అలరించే సకల కళల సమన్వయ వేదిక అయిన చలన చిత్ర మాధ్యమం ఎంత శక్తివంతమైందో, సమాజంమీద, దాని ప్రభావం, ఎలాంటిదో, ఎంతటిదో గుర్తిస్తే సినిమా పట్ల మన దృక్పధంలోనూ, ఆలోచనలోనూ కొంత సీరియస్నెస్ చోటు చేసుకుంటే, ఈ రకమైన అసహనం ఉపేక్ష కాస్త తగ్గుతాయి.

కవిత్వం అనేది ఒక బ్రహ్మ పదార్ధంలాంటిది. ఎవరి ప్రమాణాలను బట్టి వారు, ఎవరి అభిరుచినివారు, వారికి తోచిన రీతిలో నిర్వచించుకుంటారు కనుక, సినిమా పాటల్లో కవిత్వం ఉంటుందా, ఉంటే ఎంత ఎలాంటిది లాంటి కసరత్తు వల్ల కాళ్ళపీకు తప్ప మరే ప్రయోజనం లేదు.

సినిమా పాటని రసజ్ఞుడు, చెవులారా వింటూ, కళ్ళారా చూస్తూ, కధారా భరిస్తూ, త్రిపాత్రాభినయం చెయ్యాలి.

ఈ త్రివేణీ సంగమంలో, గీత “రచన” స్వర గంగ, చిత్ర యమునల అడుగున అంతర్వాహిని అయిన ’సరస్వతి’ ప్రవాహంలా ఉంటుంది.

భాషపట్ల, సంస్కృతి పట్ల, విలువల పట్ల, కళావికాసం పట్ల అక్కర ఉన్న ప్రతి ఒక్కరూ… ఎప్పటికప్పుడు ఎంతో కొంత ప్రయాసపడి, ఆ అంతర్వాహినిలోని సరస్వతిని సమీక్షిస్తూ ఉండాలి. లేకపోతే, క్రమంగా, ఆ ‘అంతర్వాహిని’ సారస్వత లక్షణాలు అంతరించిపోయి, స్వరగంగ, చిత్రయమునల దివ్వేణీ సంగమ చలన ’చిత్ర’కేళికి నేపధ్య సంగీతం వినిపించే గులకరాళ్ళ గలగల సవ్వడి మాత్రమే మిగులుతుంది.

సినిమా పాటల ద్వారా ఆనుపమానమైన కవనశక్తనికదం తొక్కించి, తమిళప్రజల హృదయాల్లో పట్టాభిషక్తుడై, తమిళ రాష్ట్ర ఆస్థాన కవిగా మనన్న పొందిన కణ్ణదాసన్ గారికి కెమోౖడ్పుగావిస్తూ, ‘సినిమా పాటల కవిగానే నోబేల్ ప్రైజ్ పొందడం నా ఆశయం’ అని స్పష్టంగా ప్రకటించిన వెరౖ ముత్తుగారి సంకల్పస్థైర్యానికి జేజేలు పలుకుతూ, సినిమా పాటల ద్వారానే, మనిషి మనిషినీ మనసు మనసునీ తడిమి, తడిపి, నిలువెల్లా కరిగించి, అల్పాక్షరాల్లోని అనల్పార్థ నిస్మృతిని, అతి సామాన్యుడి క్కూడా పరిచయం చేసి, మన‘సుకవి’గా, తెలుగువారి నీరాజనాలందుకున్న ఆత్రేయగారి స్మృతికి అంజలి ఘటిస్తూ, సారస్వతసీమలో సంపాదించుకున్న ఆధిపత్యానికి, అగ్రపీఠానికి ఏ మాత్రం తగ్గని స్థాయిని, సినీ కవిగా కూడా సాధించుకున్న పింగళి, సముద్రాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరధి, ఆరుద్ర, కొసరాజు, డా. సినారె, ఆదిగా గల సినీ కవి కుల ఆచార్యవరులకు అభివాదం చేస్తూ, సినిమా పాటని సంపూర్ణమైన వాణీ విలాసంతో, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కవితా శిల్పంగా మలిచే ప్రక్రియలలో, తెలుగు సినిమాపాటని ’శారదనీరద రాగచంద్రికా విలసితమైన విహాయస వీధుల్లో , భారతీ సామ్రాజ్యపు బావుటాగా ఎగరేసిన వేటూరి సుందరరామ్మూర్తిగారికి వినమ్రంగా ప్రణమిల్లుతూ..

‘సినిమా కవి కేవలం, మాటలిన్న పోగు చేసి మూటలు గట్టడం మాత్రమే చెయ్యడని, అవసరమైన చోట అవకాశం ఉన్నచోట, వెన్నెల కిరణాల సత్యాన్ని సహృదయులు గమనించాలనీ, గుర్తించాలనీ…’ సవినయంగా మనవి చేస్తున్నా.

శ్రీశైల మల్లన్న శిరసొంచేనా, చేనంతా గంగమ్మ వాన – దేవులపల్లి

కనుపాప కరువెనౖ కనులెందుకు-తనవారె పరులెనౖ బ్రతుకెందుకు- మల్లాది

కలలోనే ఒక మెలకువగా – ఆ మెలకువలోనే ఒక కలగా – పింగళి

బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ – సముద్రాల

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే – శ్రీశ్రీ

రాయినెనౖ కాకపోతిని రామపాదము సోకగా- ఆరుద్ర

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపిగురుతులు – ఆత్రేయ

పిట్ల మనసు పిసరంతెనాౖ ప్రపంచమంతా దాగుంది – దాశరధి

ప్రాణమున్న మనిషి కన్న శిలలే నయమనిపించును -డా . సినారె

ఏతవేసి తోడినా ఏరు ఎండదు పొగిలిపొగిలు ఏడ్చినా పుంత నిండదు – జాలాది

ఇలా, ఇలాంటివే, ఇంతకు మించినవే, తెలుగు సినీ కవులె ప్రతి ఒకరి కలం నుంచీ జాలువారిన అమృత శిఖరాలు ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. పై ఉదాహరణలనూ, అలాంటివాటిని, పరిశీలిస్తే….

ఆ వాక్యాలు చదువుతూనే అవి మాములు పొడి పొడి మాటలు కావనీ, వాటిల్లో అంతర్లీనంగా, ‘ఇది ఇంతే’ అని చెప్పడానికి వీల్లేనంత విషయం దాగి ఉందని తెలుస్తుంది. మాములు కంటికి కనిపించని ఏవో ఎన్నో దృశ్యాలు, ఆ వాక్యాలు చదువుతుంటే మనో నేత్రానికి కనిపిస్తాయి.

ఫలానా రాగమో, ఫలానా విధానమో చెప్పకపోయినా, ఆ వాక్యాలు, ఊరికే ఉత్తి వచనంలాగా కాకుండా, ఏదో పైకి వినిపించని నిశ్శబ్ద సంగీతంలో స్వరాల ఊయలలూగుతున్నట్టు గుండెకి వినిపిస్తుంది.

అంటే, కథో, సన్నివేశమూ, పాత్రలో, బాణీయో, గాత్రమో, వాద్యాలో, ఏవో సహాయం చెయ్యకుండానే, ఏమీ చెప్పనక్కరలేకుండానే ఈ వాక్యాలు భావాన్ని, చిత్రాన్ని, సంగీతాన్ని తమలో నిసర్గంగా పొదుపుకుని స్వతంత్రంగా మనగలుగుతున్నాయి అని అర్ధం అవుతోంది.

కాగితం మీద రాసుకుని, మౌనంగా కళ్లతో చదువుతూ ఉంటే, ఆ పాటని విననప్పుడు కలిగే అనుభూతిని మించిన రసానందాన్ని కలిగిస్తే అది పాట మాత్రమే కాదు, ‘లిరిక్’ కూడా అవుతుంది.

ఛందస్సులో గణాలు సరిపెడితే ‘అన్నిమందులు ఇచ్చట అమ్మబడును’, ’అప్పికట్లకు ఆలూరు ఆరుమైళ్ళు’ లాంటి మాటలు ఏ విధంగా పద్యాలు కావో, సంగీతపు బాణీకి సరిగ్గా అతికేట్లు మాటలు పోదిగినంతలో అది పరిపూర్ణమైన అర్ధంలో పాట అవదు.

సంగీతపు పాట గుఱించి రెండు వేరు వేరు అభిప్రాయాలున్నాయి. రెండూ స్పష్టమైనవే. ఒకదానికొకటి వ్యతిరేకమైనా, దేని దృష్టి నుంచి చూస్తే అది నూటికి నూరుపాళ్ళు సమర్థనీయమే.

ఒక్కటి సినిమాలో పాట అనేది ఒక మ్యూజికల్ రిలీఫ్. అంతే అంతకుమించి సినిమా పాటకు ఎక్కువ ‘చోటు’, గౌరవమూ కోరకూడదు. సినిమా పాట ఆ కథని, పాత్రలనీ ఆధారం చేసుకుని ఉంటుంది కనుక, భాషలోనూ, భావంలోనూ ఆ పరిమితుల్ని, అతిక్రమించి, సినిమా ‘కవి’ తన సొంత భావాలు చొప్పించకూడదు.

సెకెనుకి ౨౪ ఫ్రేముల్తో పరిగెత్తే చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకుడి చెవిలో పడే ఈ పాటల్లోని ‘పదాలు’, మెదడు మీదెక్కి కవాతు చేస్తూ ఉంటే, ప్రేక్షకుడు పాటల వెనుక దృశ్యాన్ని చూడాలా, పాటాడే వాళ్ళ ఆట చూడాలా, లేక, పాటల్లో ఏముందో, ఎంత ఉందో అని కళ్ళు మూసుకుని ఆలోచనలో పడాలా?

పెగాౖ, సినిమా చూసే ప్రేక్షకులందరూ కవులో, ఫిలాసఫర్లో కారు. సినిమాలో కధెనాౖ, సన్నవేశమైనా, మాటెనాౖ, పాటెనాౖ, తమకి అర్ధం అయేటట్టు అందుబాటులో ఉండేటట్టుగానే ఉండాలి గాని, ‘దిగిరాను దిగిరాను భువికి’ అని చెట్టెక్కి కూచోకూడదు. ప్రేమ, కోపం, బాధ, సంతోషం, భయం, ఉత్సాహం, ఇలాంటి భావాలన్ని మామూలు ప్రజలు ఏ విధంగా వ్యక్తీకరిస్తారో, పాటల్లో ఉన్న పదాలు కూడా అలాగే వ్యక్తీకరించాలి.

మాట ఎక్కడైతే మూగబోతుందో, పాట అక్కడ మొదలవుతుంది. మామూలు భాష సరిపోనంత, సున్నితమై న, లోతెనౖ, విశాలమైన భావాలు వ్యక్తమఅవుతాయో ఆ పద్ధతిలో ఉంటేనే పాటకి, ‘గీతం’ అని చెప్పుకునే పరపతి ఉంటుంది.

సినిమా పరిధుల్ని అతిక్రమించకుండానే పాత్రల ఔచిత్యాన్ని భంగపరచకుండానే, తన పాట, సాహితీలోకం, పౌరసత్వాన్ని పొందగలిగేలా సినీ కవి రాయగలడు. రాయవచ్చు. రాయాలి.

పాత హిందీపాటలు మన సినీ కవులు, అనేక సందర్భాల్లో అనేకసార్లు సృష్టించిన, మచ్చలేని అచ్చమైన ‘కవితలు’ గా చెలామణి కాగలిగే సత్తా ఉన్న పాటలు వింటూ, నా అభిప్రాయం బొత్తిగా నేల విడిచిన సాము కాదని-కాస్త మనసు పెడితే లొల్లాయి పదాలకి, అన్నమాచార్య, త్యాగయ్యాదుల గురుకులంలో ’అక్షరాభ్యాసం’ చేయించి, ‘విద్యాబుద్ధులు’ ఒంటబట్టేలా చేయించవచ్చని అనిపించేది.

క్రమక్రమంగా తెలుగు పలుకుబడి, తెలుగులోని తేనెతేటల తియ్యదనం, చిక్కిపోతున్న ఈ రోజుల్లో, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇత్యాది హిరణ్యాక్షుల చేతుల్లో, భూగోళం చాపచుట్టలా చుట్టుకుపోతూ, గ్లోబలైజ్ అయిపోతూ ఉండడం వల్ల కాస్త ఓపికగా, తీరిగ్గా, కూచుని చదివే అలవాటు, నిలబడి ‘మాట్లాడుకునే’ సరదా, అన్ని పోయి, పరుగులు పెడుతునన్న కాలంలో, పుస్తకాలు, సభలు, చర్చలు, సమాలోచనలూ అన్నీ ’అవుటాఫ్ ఫేషన్’ అయిపోతున్న నాగరికతలో, ఇంకా ప్రజలందరిని అకట్టు కోగలుగుతున్న ఈ ‘చలనచిత్ర’ వేదిక ద్వారా అయినా, భాష, భావం, ఆలోచన, స్పందన, లాంటి విలువలిను కాపుకాసే ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదు?

ఇలాంటి నా కలవరం అంతా పెకిౖ వెళ్లబోసుకోడానికి నాకు దొరికిన సువర్ణ అవకాశం, సినిమాల్లో పాటలు రాయగలిగే పని దొరకడం.

ఏ కవికి అయినా సినీ కవి కాగలగడం గొప్ప అదృష్టం అని నేను భావిస్తాను. ఎందుకంటే, బైట కవిగా ఉంటే ఎప్పుడో ఏదో స్పందన కలిగి రాసేందుకు ప్రేరణనిస్తుంది. సినీ కవిగా ఉంటే, స్పందన కలిగేదాకా ఎదురు చూసే వీల్లేదు. ‘స్పందన’ కలిగించుకోవడమే. ప్రతిపాట ఒక సవాల్. ఇన్ని రకాలుగా ప్రేరేపించి, ఇన్ని రకాలుగా వ్యక్తీకరించమని నిరంతరం వెంట తరిమే అవకాశం ఇక్కడ, ఈ పనిలో తప్ప బైట దొరకదు.

అలా రాయవలసి వచ్చిన ప్రతీపాటని, నా అభిరుచికి తెరలు వెయ్యకుండా, అలాగని సినిమా పాట పరిధిని దాటకుండా, రాయడానికి ప్రయత్నిస్తున్నాను.

ఆకాశాన్ని అందుకోవాలని అల ఆశ పడుతుంది. ఎగురుతుంది. పడిపోతుంది ఎప్పటికైనా అందుకుంటుందా లేదా? అన్న ప్రశ్న కాలం ఉన్నంత కాలం ఉంటుంది.

‘పాట యిలా ఉండాలి’ అనే నా ఆశ ఆకాశం అయితే, నా ప్రతి పాట ఆ నింగిని అందుకోవటానికి ఎగసే తరంగం. అంబరం అందలేదే అని కృంగిపోయి ఆగిపోవటానికి, అలిసిపోవటానికి అవకాశం లేనంత సంబరంగా ఆ తరంగాల మీద నేనూగుతున్నా(సిను).

WhatsApp