

నీతిచంద్రికలో పద్యం
విద్య యొసఁగును వినయంబు వినయమునను
బడయు పాత్రత పాత్రత వలన ధనము
ధనము వలన ధర్మంబు దానివలన
నైహికాముష్మిక సుఖములందు నరుడు.
భావం: విద్య వినయాన్ని, అణుకువను నేర్పుతుంది. వినయం వల్ల యోగ్యత కలుగుతుంది. యోగ్యత వల్ల ధనం లభిస్తుంది. ధనం వల్ల మంచి పనులు చేసే అవకాశాలు మెరుగవుతాయి. మంచి పనులు చేస్తే మనిషికి ఇహలోక, పరలోక సుఖాలు లభ్యమవుతాయి.