
రామాయణ, భారత, భాగవతాలు మన జనజీవన స్రవంతిలో మిళితమై, మన కళలను కూడా ప్రభావితం చేశాయి. శిష్టులకు పురాణేతిహాసాలు కావ్యాల రూపంలో అందుబాటులో ఉంటే, పామరులకు ఆ లోటును మన జానపద కళలు తీర్చాయి. రామాయణం ఈ విషయంలో ముందుందని చెప్పవచ్చు. రసమయ రామాయణం ఒక తరం నుంచి మరో తరానికి అందచేయటంలో జానపద గేయాలు ఎంతగానో ఉపకరించాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగ..
మాఘ బహుళ చతుర్దశినాడు మనం "మహాశివరాత్రి" పర్వదినం జరుపుకుంటాం. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం గురుంచి చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద..
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ సనాతన ధర్మం మనకిచ్చిన రెండు అద్భుత మహామంత్రాలివి. ఒక మంత్రం నారాయణుడిని స్మరిస్తే, మరొకటి శివుడిని ఆరాధిస్తుంది. మనలో కొందరికి మహేశ్వరుడి కారుణ్యమూ, ప్రసన్న రూపమూ, ఏ వరం కోరినా కాదనకుండా ప్రసాదించే భోళాతనమూ నచ్చుతాయి. మరి కొందరికి, సాత్విక గుణస్వరూపుడైన విష్ణుమూర్తి, ఆయన అనేక అవతారాలలో చేసిన లీలలు మహాప..
రామాయన్న పదమ్మువిన్న నిదె సర్వస్వమ్ము నుప్పొంగి, ఏ సామోద్గీథములో ధ్వనించు రసవేషా! నాడులే తంత్రులై ఆమోదమ్ముగ లీలగా బ్రతుకు తానై రామసంకీర్తన మ్మై మాధుర్య తరంగమౌను శుభధామా! రామచన్ద్రప్రభూ! సామము గీతాత్మక నాదం. దానికి సారం – ఓంకారం, అదే శ్రీరామ నామం. ఆ కారణంచేత, రామస్మరణ రసవంతమైన ప్రణవానికీ, ప్రణవ జన్యమైన గీతానికి హేతువౌతోంది. ఓంకార స..
హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు. 'రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములన..
విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమచైతన్యి జగదంబగా ఆరాధించే సాంప్రదాయం శాక్తేయం. ఏ ‘శక్తి’ వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే దేవి. వేదాలు మొదలుకొని పురాగమాల వరకు ఆ జగన్మాతను దేవీ నామంతో కీర్తించాయి. ఈ నామానికి ‘ప్రకాశ స్వరూపిణి’ అని అర్ధం. అన్నింటికీ చైతన్యాన్ని ప్రసాదించే స్వయంప్రకాశక శక్తి దేవి. మరొక అర్ధం క్..
దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షసశక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’. నవరాత్రుల పూజ ..
శరన్నవరాత్రులు పదిరోజుల ఉత్సవం. శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని పూజిస్తారు. అందువల్లనే ఈ ఉత్సవాలని ‘దేవీ నవరాత్రులని’ కూడా పిలుస్తారు. పండుగ మొదటి మూడురోజులు పార్వతీదేవిని, తర్వాతి మూడురోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు సరస్వతీదేవిని పూజిస్తారు. అందు తొలిరోజు కనకదుర్గాదేవి, రెండోరోజు బాలా త్రిపుర స..