సుమతీ శతకం - 1

సుమతీ శతకం - 1
సుమతీ శతకం - 1

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ!

భావం: ఎవరు ఏమి చెప్పినా వినవచ్చును. అయితే విన్నవెంటనే తొందరపడకుండా, విషయాన్ని అవగాహన చేసుకొని, బాాగా ఆలోచించి నిజానిజాలు గ్రహించగలిగినవాడే నీతిపరుడని బద్దెన ఈ పద్యంలో వివరించాడు.