సుమతీ శతకం - 3
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
తెల్లనికాకులును లేవు తెలియుము సుమతీ.
భావం: మంచితనం గల అల్లుడు, పండితుడైన శూద్రుడు, సత్యము చెప్పు ఆడది, పొల్లున తీసిదంచిన బియ్యము, తెల్లగా ఉండు కాకులు ప్రపంచమందు లేవు అని దీనర్థము.