సుమతీ శతకం - 2

సుమతీ శతకం - 2
సుమతీ శతకం - 2

ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
అపకారికి ఉపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ

భావం: తనకు సహాయం చేసిన వారికి మేలు చేయడం గొప్పేమి కాదు. కాని అపకారం చేసినవాడికి కూడా, వాడి అపకారములను లెక్కించక ఉపకారం చేసేవాడే ఉత్తముడు.