సర్వేశ్వర శతకం

సర్వేశ్వర శతకం
సర్వేశ్వర శతకం

భ్రమరధ్యానము దాల్చి కీటకము సద్భావాది సంయుక్తిదా
భ్రమరంభై ఖగవీధి నాడు ననిన, న్భావించి నిన్నాత్మనె
య్యముతో ధ్యానము సేయు మర్త్యుడును నీ యట్లే పరవ్యోమ త
త్త్వము నందవ్యయలీల నుండు టరుదే భావింప? సర్వేశరా

భావం: తుమ్మెద కీటకాన్ని తెచ్చి దాని గూటిలో పెట్టి భ్రమర శబ్దం చేస్తూ గూటి చుట్టూ తిరుగుతుంది. కొన్నాళ్లకు కీటకం భ్రమరమౌతుంది. అలాగే నిశ్చలంగా ధ్యానం చేసే మానవుడు చిదానందస్థితికి చేరుకుంటాడు.