

సరస్వతీ దేవి పద్యం 2
కరకమలంబునందుఁ బటికంపుఁ గమండలు పచ్చకాంతి భా
సురమగు మౌక్తికంపు జపసూత్రము దాల్చుట బ్రహ్మచారియై
పరంగిన హంసమున్ బిలిచి బాల మృణాళముఁ జూపు చందమౌ
సిరి దిలకింప నొప్పు బుధసేవిత మూర్తిఁదలంతు భారతిన్.
భావం: ప్రబంధపరమేశ్వరుని నృసింహపురాణంలోనిదీ సరసర్వతీ పార్థన. భారతి యొక్క ఒక కరము నందు హంసాకృతిలో స్ఫటిక కమండలువు ఉన్నది. మరొక హస్తపద్మంలో మౌక్తిక జపమాల లేత తామరతూడు వలె ధావళ్యంలో వెలుగొందుతున్నది. ఈ స్వరూపము వేదాధ్యేతగా తన దగ్గర ఉన్న వాహహనమైన హంసను పిలిచి ఇదిగో నీకు ఆహారమని చూపుతన్నట్టు చూపరులకు తోస్తున్నది. బుధులు, కవులు, పండితులు ఎల్లప్పుడు సేవిస్తుండే భారతి కవి కూడా ఆరాధ్యరాలు.