

సరస్వతీ దేవి పద్యం1
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నడు గల్గు భారతీ
భావం: తెల్లని కాంతులు వెల్లివిరిసే శరన్మేషు కందంబమూ, శారదచంద్రబింబమూ, పచ్చకర్పూరమూ, పటీరమూ, రాజహంసలు, జాజిచెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా, రెల్లుపూలు, ఆదిశేషుడూ, మల్లెలూ, మందారాలూ, పాలసముద్రమూ, పూచిన పుండరీకాలూ, ఆకాశగంగా ఇవన్నీ శారదాంబా నీ శుభాన్ని సూచించే ఉపమానాలు. అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా, మనసుదీరా ఎన్నడు దర్శింతునో గదా యని పోతన భాగవంతో శారదాంబను స్తుతిస్తూ చెప్పిన పద్యమిది.