శివ కర్ణామృతం 1

శివ కర్ణామృతం 1
శివ కర్ణామృతం 1

న యత్ర సూర్యోన విధుర్న వహ్ని
ర్నభిన్నతా న త్రిగుణావభాసః
చరంతమానందమయే మహిమ్ని
మృడం భజామో మృగితం మునీంద్రైః

భావం: సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రవేశింపని భిన్నత్వములేని, త్రిగుణములు లేని, ఆనందమయమైన మహిమోపేతమైన, స్థానమునందు వెలుగొందునట్టి, మునీంద్రులు అన్వేషించునట్టి శివుని భజించెదము.