వేమన పద్యం - 5

వేమన పద్యం - 5
వేమన పద్యం - 5

కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు
దోమ గజముగాదు దొడ్డదైన
లోభి దాతగాడు లోకంబు లోపల
విశ్వధాభిరామ వినురవేమ.

భావం: ఎలాగైతే గొప్పదైనా కుక్క సాధు జంతువైన గోవు కాలేదో; భయంతో పారిపోయే కుందేలు పులికాలేదో; తొండం గల దోమ ఏనుగు కాలేదో, అదేవిధంగా పిసినిగొట్టు దాత కాలేడు.