

వేమన పద్యం 3
నిక్కమైన మంచినీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేల
చదువపద్యమరయఁ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ
భావం: విలువలేని నీలమణి ఒక్కటైనా చాలు. విలువలేని రాళ్లు తట్టడైనా పనికిరావు. అలాగే రసవత్తరమైన పద్యం ఒక్కటైనా చాలు. భావశుద్ధిలేని పద్యాలు నిరర్థకమే కదా.