వేమన పద్యం-2

వేమన పద్యం-2
వేమన పద్యం-2

సకలాకరుడు ఁడనంతుఁడు
సకలాత్మలయందు సర్వసాక్షియు తానై
సకలమున నిర్వికారుం
డకలంక స్థితిని బ్రహ్మమని బడువేమా

భావం: ‘సర్వం విష్ణుమయం జగత్’ అను ఉపనిషత్ సిద్ధాంతాన్ని తేటతెల్లపర్చే పద్యమిది. అంతటా వ్యాపించియున్న సర్వాంతర్యామి, పరిపూర్ణమైన పరబ్రహ్మ ఒక్కడే. సకల చరాచర జగత్తులో వ్యాపించి, సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడేనన్న మూలతత్త్వాన్ని తెలుపుతొంది ఈ పద్యం.