విఘ్నేశ్వరునిపై పద్యం

విఘ్నేశ్వరునిపై పద్యం
విఘ్నేశ్వరునిపై పద్యం

తుండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్

భావం: పెద్దతొండం, తెల్లని ఒక దంతం, పెద్ద పొట్ట, ఎడమచేయి, అందంగా సవ్వడి చేసే గజ్జెలు, ప్రేమగా చూసే చూపులు, చిరునవ్వు, పొట్టి ఆకారం, కోరిన విద్యలను ఇచ్చే గురువు … వంటి వాడివి అయిన పార్వతీ కుమారా! గణాలకు అధిపతి అయిన వాడా! నీకునమస్కరిస్తున్నాను.