మహాభారత పద్యం-2

మహాభారత పద్యం-2
మహాభారత పద్యం-2

వెలఁది జూదంబు పానంబు వేఁట పలుకు
ప్రల్లదంబును దండంబుఁ బరుసదనము.
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత
యనెడు సప్తవ్యసనములఁ జనదు తగుల

భావం: స్త్రీ సాంగత్యం, జూదం, మద్యపానం, వేట, కఠినంగా మాట్లాడడం, అతిపరుషమైన దండన విధించడం, ధనాన్ని ఏ మాత్రం ప్రయోజనం లేకుండా వ్యయం చేయడం అనేవి ఏడూ సప్తవ్యసనాలు.