మహాభారతము

మహాభారతము
మహాభారతము

అమితాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థమలచ్ఛాయమై
సుమహావర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్తమ నానాగుణకీర్త నార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై

భావం: వేదవ్యాసుడొక ఉద్యానవనము. అందు భారతము పారిజాతము వంటింది. ఆ చెట్టు ఆఖ్యాన ఉపాఖ్యానము లనెడి వివిధ శాఖలతో విరాజిల్లుచున్నది. నాల్గువేదముల అర్థమే దాని నీడ. ధర్మార్థకామ మోక్షములను పురాషార్థములే పూలగుత్తెలు. నరనారాయణలు మహోన్నత గుణములను గానము చేయుటయే ఆ చెట్టునకు పండిన పండు. ఈ భారత పారిజాతమే వేద వేత్తలచే కోరదగినది.