భాస్కర రామాయణం - 1

భాస్కర రామాయణం - 1
భాస్కర రామాయణం - 1

క్షమయ జనుల కాభరణము, క్షమయ కీర్తి
క్షమయ ధర్మంబు, క్షమయ సజ్జనగుణంబు
క్షమయ యజ్ఞంబు, క్షమయ మోక్షంబు, క్షమయ
సకలదానంబు, క్షమయందె జగము నిలుచు

భావం: ప్రజలకు భూషణము క్షమయే అనగా సహనం. పాటించదగిన ధర్మము, సజ్జనులలోని ఉత్తమగుణం క్షమయే. ఈ లోకమంతా క్షమ అన్న ఒక్క గుణంపై ఆధారపడి నిలిచియున్నది. అందువలనే మనిషి సహానాన్ని అలవర్చుకుని ఓర్పుతో జీవనం సాగించాలి.