భాస్కర రామాయణం - 2

భాస్కర రామాయణం - 2
భాస్కర రామాయణం - 2

అంతఁగడంక రాముడు సమగ్ర భుజాలుల విక్రమోత్సవం
బెంతయు బర్వ మౌర్వి మొరయించె దిగంతర దంతి కర్ణరం
ధ్రాంతర సాగరాంతర ధరాభ్ర తలాంతర చక్రవాళ శై
లాంతర సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్

భావం: శ్రీరాముని ధనుష్టంకారాన్ని ఈ పద్యం వర్ణిస్తుంది. మౌర్వీరవం దిగంతరాల్లో, ఎనిమిది దిక్కులో వుండే దిగ్గజాల శూర్ప కర్ణాల వివరాలలో హ్రీంకారించింది. సముద్రాంతరాల్లో, భూమికీ ఆకాశానికీ మధ్య సర్వ వాతావరణంలోనూ ప్రతిధ్వనించింది. పర్వత సమూహాల్లో మారుమ్రోగి, కొండగుహల్లో నిండిపోయింది.

WhatsApp