భాగవత పద్యం-4

భాగవత పద్యం-4
భాగవత పద్యం-4

కలఁడంభోధిఁ, గలండు గాలిఁ, గలఁడాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గల, డీశుండు గలండు, తండ్రి వెదకంగా నేల నీ యా యెడన్

భావం: భగవంతుడైన విష్టువు లేనిచోటు విశ్వంలో లేదు. సముద్రంలో, ఆకాశంలో, అవని యందు అగ్నిలో, అన్నిదిశాల ఉన్నాడు. రాత్రియందు, పగటి యందు, సూర్య, చంద్రులందు, ఓంకారమందున్నాడు. త్రిమూర్తులలో, స్త్రీ, పురుష, నపుంసకులందు, అక్కడ, ఇక్కడాని ఏమి సర్వేశ్వరుడు అంతటా నిండి యున్నాడని ఈ పద్యభావం.

WhatsApp