భాగవత పద్యం-3

భాగవత పద్యం-3
భాగవత పద్యం-3

పుట్టువు లేని నీ కభవ పుట్టు క్రీడయ కాక పుట్టుటే?
యెట్టనుడున్ భవాదిదశ లెల్లను జీవులయం దవిద్య దాఁ
జుట్టుచు నుండుఁ గాని నినుఁ జుట్టినదింబలెఁ బొంత నుండియుం
జుట్టఁగ లేమిఁ దత్క్రియలఁ జొక్కని యెక్కటి వౌదు వీశ్వరా

భావం: పుట్టు ఎరుగని నారాయణా నీకు పుట్టుకంటూ వేరే లేదు. ఇలా పుట్టుట నీకు క్రీడ కాని పుట్టుక కాదు. జన్మ, మరణం జీవులను మాయ కారణంగా ఆవహించే స్థితిగతులు. కానీ మాయాదేవీ నీ ప్రక్కను ఉండి కూడా నిన్ను స్పృశించలేదు. మాయలకు చిక్కని ఏకైకమూర్తివి నీవు. కనుకనే ఈ జగత్తులన్నింటికి నీవు ఈశ్వరుడవు.