భర్తృహరి సుభాషితములు 1

భర్తృహరి సుభాషితములు 1
భర్తృహరి సుభాషితములు 1

తివిరి యిసుమను తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖల మనసు రజింపరాదు

భావం: ఇసుకును పిండైనా సరే అతికష్టమ్మీద దానిలోంచి నూనె తీయవచ్చు. ఎండమావ్వుల్లోంచి నీళ్లు తాగవచ్చు. కావాలనుకుంటే లోకమంతా తిరిగి ఎక్కడైనా కుందేటి కొమ్ము సాధించవచ్చు. కాని మూర్ఖుని మనసు సంతోషపెట్టడం చాలా కష్టం.