భర్తృహరి సుభాషితములు 3

భర్తృహరి సుభాషితములు 3
భర్తృహరి సుభాషితములు 3

తరువు లతిరసఫలభార గురుతగాంచు
నింగి వ్రేలును అమృత మొసంగు మేలు
డుద్దతులు కోరు బుధులు సమృద్ధి చేత
జగతినుపకర్తలకునిది సహజ గుణము

భావం: జగత్తులో ఉపకార గుణం కలిగిన వారు ఫలాపేక్షలేకనే పనులు చేస్తారు. అది వారి సహజగుణం. చెట్లు తియ్యని ఫలాలని మోసి మనకందిస్తాయి. చంద్రుడు చల్లదనాన్ని ఆహ్లాదాన్నిచ్చే వెన్నెల కాయిస్తాడు. బుద్ధమంతులు లోక శ్రేయస్సు ఆశిస్తారు తప్ప మరి ఒకటి కోరురు.