భాగవత పద్యం - 1

భాగవత పద్యం - 1
భాగవత పద్యం - 1

కొందఱికిఁ దెనుఁగు గుణ మగుఁ
గొందఱికిని సంస్కృతంబు గుణ మగు రెండున్
గొందఱికి గుణము లగు నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్

 

కావ్యమంటే సంస్కృత కావ్యమే. పాండిత్యమంటే సంస్కత పాండిత్యమే అని భావించే నాడు కూడా తాను ఉభయకావ్యకరణదక్షుడ నని పోతన సగర్వంగా, సవినయంగా తెలియచేసిన పద్యమిది. సంస్కృత భాష భూయిష్ఠ రచన అందరికి అందుబాటులో ఉండదని పాలకురికి సోమనాథుడు హూంకరించగా, నా కవిత్వంబు నిజము కర్ణాటభాష అని శ్రీనాథుడూ సంస్కృతానికి పట్టం కట్టగా, ప్రాచీనాంధ్రకవులందరికీ పోతన ఈ పద్యంలో సమాధానమిచ్చాడు