దాశరథీ శతకము - 5

దాశరథీ శతకము - 5
దాశరథీ శతకము - 5

సలిలతరామనామజపసారమెరుంగను కాశికాపురీ
నిలయుడగాను, మీ చరణనీరజరేణుమహాప్రభావముం
తెలియ నహల్యగాను, జగతీవర, నీదగు సత్యవాక్యముం
తలపగ రావణాసురుని తమ్ముడగాను, భవద్విలాసమున్
తలచి నుతింప నాతరమె? దాశరథీ కరుణాపయోనిధి

భావం: నీ నామపారయణం చేత కలిగే శక్తి కాశీ విశ్వేశ్వరుడికి తెలియును. నీ పాదదూళి యొక్క మహిమ అహల్యా దేవికి తెలియును. నీ సత్యవాక్కులోని గొప్పతనం విభీషణునికి తెలియును. కాని నాలాంటి పామరునికి నీ లీలా విశేషాలు తెలుసుకోవడం సాధ్యమా ఓ రామచంద్రా అని ఈ పద్య భావం.