దాశరథీ శతకము - 4

దాశరథీ శతకము - 4
దాశరథీ శతకము - 4

ముదమునకాటపట్టు, భవమోహమదద్విరదాంకుశంబు, సం
పదలకొటారు, కోరికల పంట, పరంబునకాది, వైరుల
న్నదలజయించు త్రోవ విపదబ్ధికి నావ గదా సదా భవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధి.

భావం: రామా అను నీ నామస్మరణ శాశ్వతానందము కల్పించునటువంటిది. మోక్షమునకు మూలము. ఆపదల సముద్రమునకు నావ. మోహమనెడి మదించిన ఏనుగును అంకుశము వలె పొడుచును. ఐశ్వర్యముల నిచ్చు ధనాగారము. కోరిన కోర్కెలను తీర్చును. సంగ్రామమున విజయమొంసుగును.