దాశరథీ శతకము - 2

దాశరథీ శతకము - 2
దాశరథీ శతకము - 2

కరములుమీకు మ్రొక్కు లిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ
మీ స్మరణదనర్ప వీనుల భవత్కధలన్ వినుచుండ నాస మీ
యఱుతను బెట్టుపూసరుల కానగొనం బరమాత్మ సాధనో
త్కర మిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: చేతులు నీకు నమస్కరించుచున్నమి. కన్నులు నిన్నె చూస్తున్నాయి. నాలుక నిన్న మాత్రమే స్మరిస్తున్నది. వీను నీ కథామృతమును గ్రోలుచున్నవి. నాసిక నీ పూలపరిమళములను ఆస్వాదించుచున్నది.ఇట్లు పంచేద్రియములు నిన్నె తలచి, మొక్క్రుటయే మోక్షమార్గము. అట్టి మార్గమును నాకొసంగుము రామచంద్రా.