చౌడప్ప శతకం 1
తనయునికిని పరదేశికి
పెనిమిటికిని నొక్కరీతి విం దిడియెడు వా
వనితను పుణ్యాంగన యని
ఘనులందురు కుందవరపు కవి చౌడప్పా
భావం: భోజనం దగ్గర పంక్తిలో ఫలభేదం చేయకూడదంటారు. తన కొడుక్కు, అతిథికి, భర్తకు ఒకే విధంగా వడ్డించే వనితను పుణ్యాత్మురాలంటారు.