గువ్వలచెన్న శతకం-1

గువ్వలచెన్న శతకం-1
గువ్వలచెన్న శతకం-1

గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!

భావం: గుడి కూలిపోవచ్చు. నూతిలో, చెరువులో నీరు ఇంకవచ్చు. వనాలు నాశనమూ కావచ్చు. ఎప్పటికి చెడకుండా కీర్తి బావుటాను ఎగరవేయునది పద్యమోకటే.