కృష్ణశతకం - 2

కృష్ణశతకం - 2
కృష్ణశతకం - 2

కుక్షిని నిఖిల జగంబులు
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక వటపత్రముపై
దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!

భావం: అందరిని రక్షించే కృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తున్న నీవు ధన్యుడవు.