కాళహస్తీశ్వర శతకం 2

కాళహస్తీశ్వర శతకం 2
కాళహస్తీశ్వర శతకం 2

కొడుకులు పుట్టరటంచు నేడ్తురవివేకు లీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెంపుత్రులు కాని ఆ శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడనే మోక్షపదంబు పుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వరా.

భావం: జీవితం మీద భ్రాంతి కలిగిన అవివేకులు కొందరు కొడుకులు పుట్టలేదని ఏడుస్తుంటారు. కాని కొడుకులు అనేకమంది పుట్టలేదా? కౌరవేంద్రుడైన దృతరాష్ట్రునికి. వారిచేత ఏగతులు పొందాడు? పుత్రులు లేని శుకమహర్షికి దుర్గతి వాటిల్లక మోక్షం దొరకలేదా? శ్రీ కాళహస్తీశ్వరా.