విశ్వాంతరాళంలో మహా కృష్ణబిలం కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

విశ్వాంతరాళంలో మహా కృష్ణబిలం కనుగొన్న భారత శాస్త్రవేత్తలు
విశ్వాంతరాళంలో మహా కృష్ణబిలం కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

పూర్తి క్రియాశీలంగా ఉంటూ, మరెంతో కాంతివంతంగా ప్రకాశించే ఒక పాలపుంతను (గెలాక్సీని) భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, నీహారికలు, విశ్వధూళి వంటి అన్నిరకాల ఖగోళ పదార్థాలు కలిగిన ఈ గెలాక్సీ,. సాధారణ స్థాయికంటే పదిరెట్ల మేర ఎక్స్ కిరణాలను వెదజల్లుతోంది. పదివేల లక్షల (10 ట్రిలియన్ల) రెట్ల సూర్యగోళాలకంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్న ఈ గెలాక్సీ, భూగోళానికి ఐదు వందలకోట్ల కాంతి సంనత్సరాల సుదూరంలో కనిపించింది. అతి తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికి, కాంతి వేగానికి వస్తుకణాలు ఎలా ప్రవర్తిస్తాయన్న పరిశోధనకు ఈ గెలాక్సీపై పరిశోధన ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు. విశ్వం రూపుదాల్చిన తొలినాళ్లలో ద్రవ్యరాశి పరిణామం, ప్రతిస్పందన, గెలాక్సీల పరిణామం వంటి విషయాల్లో బలమైన గురత్వాకర్షణ శక్తి నిర్వహించిన పాత్రపై అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

విశ్వాంతరాళంలోని ప్రతి గెలాక్సీకి,.. భారీ స్థాయి ద్రవ్యరాశితో కూడిన కృష్ణబిలం (సూపర్మాసివ్ బ్లాక్ హోల్-ఎస్.ఎం.బి.హెచ్.) కేంద్రస్థానంలో ఉంటుంది. కొన్ని గెలాక్సీల్లో కృష్ణ బిలం ఎంతో క్రియాశీలంగా ఉంటూ, భారీ మొత్తంలో విశ్వపదార్థాన్ని కబలిస్తూ, దాదాపు కాంతి వేగంతో ప్లాస్మా వాయు పదార్థాన్ని మనదిశగా వదలుతూ ఉంటుంది. ఎంతో శక్తివంతమైన భారీ స్థాయిలోని కృష్ణ బిలాన్ని కలిగి ఉన్న ఈ గెలాక్సీలను బ్లేజర్స్ అని వ్యవహరిస్తారు. ఒ.జె. 287 అని పిలిచే ఈ కృష్ణ బిలాల బ్లేజర్స్.ను బి.ఎల్. లాసెరేట్ గా పేర్కొంటారు. తమ మొత్తం విద్యుదయాస్కాంత పరిధిలో కాంతిని వెదజల్లడం ఒక విధంగా అసాధారణ విషయమే. అతి తీవ్రస్థాయి భౌతిక పరిస్థితుల మధ్య మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి విలక్షణమైన కృష్ణ బిలాలపై జరిగే అధ్యయనం,.. భారీ గురుత్వాకర్షణ వలయంలో ద్రవ్యరాశి ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది.

ఒ.జె. 287 (OJ 287) అనే పేరు కలిగిన ఇలాంటి ఒక కృష్ణ బిల వ్యవస్థపై ఆర్యభట్ట ఖగోళ విజ్ఞానశాస్త్ర పరిశోధనా సంస్థలోని శాస్త్రవేత్తలు 2015నుంచి పరిశోధన సాగిస్తూ వస్తున్నారు. భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్, టెక్నాలజీ శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తి సంస్థగా ఆర్యభట్ట పరిశోధనా సంస్థ పనిచేస్తోంది. ఈ వ్యవస్థలో దాదాపు ప్రతి పన్నెండేళ్లకు ఓసారి కాంతిలో పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. దీనితో ఒ.జె. 287 అనే ఈ వ్యవస్థ, ఒకే కక్ష్యలో రెండు బిలాలకు చోటు కల్పించి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని పరిశోధకులు భావిస్తున్నారు.

ఒ.జె. 287 వెదజల్లే అతి తీవ్రమైన కాంతిపై, ఎక్స్ కిరణాల బంధంపై డాక్టర్ పంకజ్ కుశ్వాహ, డాక్ర్ అలోక్ సి. గుప్తా నాయకత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తలు పూర్తిగా కొత్త కోణంలో విషయాలను వెల్లడించారు. మామూలు స్థితికి విభిన్నమైన ఈ మార్పే,.. తీవ్రమైన గుత్వాకర్షణ వలయంలో ద్రవ్యరాశి ఎలా ప్రవర్తిస్తుందో, అది కాంతి వేగంతో వస్తు కణాలను ఎలా వేగవంతం చేస్తుందో తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుందని ఈ ఖగోళ శాస్త్రవేత్తల బృందం పేర్కొంటోంది.

‘ది అస్ట్రనామికల్ జోర్నల్’ అనే సమాచార పత్రంలో ఈ పరిశోధన విశేషాలు ప్రచురితమయ్యాయి. 2017నుంచి 2020 వరకూ జరిగిన పరిశోధనా విశేషాలను ఈ సమాచార పత్రంలో వివరించారు. అహ్మదాబాద్, భౌతికశాస్త్ర పరిశోధనా సంస్థ (పి.ఆర్.ఎల్.)లోని క్షేత్రస్థాయి పరిశీలనా కేంద్రం నమోదు చేసిన అంశాలను కూడా ఈ అధ్యయనంలో పొందుపరిచారు. ఇందులో భాగంగా, మౌంట్ అబూ ఖగోళ పరిశోధనా కేంద్రంనుంచి పరారుణ కిరణ బంధాలపైన, కొన్ని ఇతర ఉపగ్రహాలనుంచి అతి నీలలోహిత, గామా కిరణాలతోను పరిశోధన జరిగింది.

ఆర్యభట్ట ఖగోళ శాస్త్ర పరిశోధనా సంస్థ (ఏరీస్)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ పంకజ్ కుశ్వాహ, ప్రొఫెసర్ అలోక్ సి. గుప్తాల నాయకత్వంలో పరిశోధన జరిగింది. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మణిపాల్, అహ్మదాబాద్ పి.ఆర్.ఎల్.కు చెందిన పి.హెచ్.డి పరిశోధక విద్యార్థిని నీరజ్ కుమారి, ప్రొఫెసర్ సచీంద్ర నాయక్, బ్రెజిల్.లోని సావోపాలో విశ్వవిద్యాలయానికి చెందిన ఎలీషాబెటె ఎం. డి గౌవీయా డాల్ పినో, ఏరీస్ మాజీ పి.హెచ్.డి. విద్యార్థి నిబేడియేట్ కలీటా, షాంఘాయ్.లోని కీ లేబరేటరీకి చెందిన ప్రొఫెసర్ మిన్.ఫెంగ్ గూ,. తదితరులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

భారీ ద్రవ్యరాశితో కూడిన కృష్ణబిలం పరారుణ కిరణ బంధాల్లో, కాంతి శక్తిలో విష్పష్టమైన మార్పులను తాము గుర్తించినట్టు ఈ పరిశోధకుల బృందం పేర్కొంది. ఇది 18వందల కోట్ల సూర్యులతో సమానమైన ద్రవ్యరాశిని కలిగిఉన్నట్టు తెలిపారు. 2017లో ఎక్స్ కిరణాల స్థితిపై జరిగిన పరిశోధనలో కూడా ఇదే తరహా మార్పును గుర్తించినట్టు వారు తెలిపారు.

November 25, 2021