1960వ దశకంలో ఆహార లోటు, ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్థితి నుండి దేశం వ్యవసాయ ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా ఎదిగిందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వేలో తెలిపారు. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసంల డిమాండ్ నిత్యావసరాల కంటే వేగంగా పెరుగుతోందని సర్వే పేర్కొంది. కాబట్టి, వ్యవసాయ రంగ విధానాలు మరింత పోషకమైన మరియు ప్రకృతి వనరులకు అనుగుణంగా ఉండే ‘డిమాండ్ ఆధారిత ఆహార వ్యవస్థ’తో మరింత సమీకృతం కావాలని సర్వే సూచిస్తుంది.
రైతు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మార్కెట్లు పనిచేసేలా ప్రభుత్వాలు తీసుకోగల ఐదు విధాన సిఫార్సులను ఆర్థిక సర్వే వివరించింది. ధరలు పెరిగిన మొదటి సందర్భంలోనే ఫ్యూచర్స్ లేదా ఎంపికలను నిషేధించకపోవడం గురించి మొదటి దశ వివరించింది. ఇటువంటి మార్కెట్లను నియంత్రించే నిర్మాణాత్మక రూపకల్పన ద్వారా వ్యవసాయ వస్తువుల ఫ్యూచర్ మార్కెట్లో అధికారుల జోక్యాన్ని నివారించవచ్చని సర్వే పేర్కొంది.
అసాధారణ పరిస్థితులలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించాలని, ప్రత్యేకించి అవి అత్యవసరమైన ఆహార ధాన్యాలు కాని పక్షంలో, దేశీయ వినియోగదారులను ప్రత్యామ్నాయం వైపు మళ్ళించాలని సర్వే చేసిన రెండవ సిఫార్సు తెలియజేస్తుంది.
మూడో దశగా, ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే నిర్మాణాన్ని (ఫ్రేంవర్క్) పునఃపరిశీలించాలని సర్వే పేర్కొంది. భారత ద్రవ్యోల్బణ లక్ష్య చట్రం, ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఆహారాన్ని మినహాయించాలని పేర్కొంది. “అధిక ఆహార ధరలు, తరచుగా, డిమాండ్-ప్రేరితమైనవి కావు, కానీ సరఫరా-ప్రేరితమైనవి. భారతదేశం యొక్క ద్రవ్యోల్బణ లక్ష్య విధానం ఆహారాన్ని మినహాయించి ద్రవ్యోల్బణ రేటును లక్ష్యంగా చేసుకోవాలా వద్దా అని అన్వేషించాలి,” అని సర్వే పేర్కొంది. పేద మరియు అల్పాదాయ వినియోగదారులకు అధిక ఆహార ధరల వల్ల కలిగే ఇబ్బందులను, నిర్దిష్ట కొనుగోళ్ల కోసం తగిన కాలవ్యవధికి చెల్లుబాటు అయ్యే నేరుగా ప్రయోజన బదిలీలు లేదా కూపన్ల ద్వారా నిర్వహించవచ్చని సర్వే పేర్కొంది.
నాల్గవ సిఫారసు మొత్తం నికర నీటి పారుదల కల భూవిస్తీర్ణాన్ని పెంచాల్సిన ఆవశ్యకత గురించి విశ్లేషించింది. అనేక రాష్ట్రాలు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయని, భారతదేశ నీటిపారుదల సామర్థ్యం ఉపరితల జలాలకు 30-40 శాతం, భూగర్భ జలాలకు 50-60 శాతం మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. మెరుగైన నీటి వినియోగ వ్యవసాయ పద్ధతులు, బిందుసేద్యం, ఫెర్టిగేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే ఆవశ్యకతను ఈ సర్వే ఎత్తిచూపింది.
ఇక ఐదవ మరియు చివరి సూచన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిరంతరంగా వ్యవసాయాన్ని తయారు చేయడం గురించి. వరి వంటి ధాన్యాలు, చెరకు నీటి ఆధారిత పంటలు మరియు వరి సాగు మీథేన్ ఉద్గారాలకు దారితీస్తుంది. పంట తటస్థ ప్రోత్సాహక నిర్మాణాలను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని సర్వే పేర్కొంది.
21వ శతాబ్ధపు మూడు అతిపెద్ద సవాళ్ల వ్యవసాయం ఒకటి. ఆహార మరియు పోషకాహార భద్రతను కొనసాగిస్తూ, వాతావరణ మార్పులకనుగుణంగా, నీరు, శక్తి మరియు భూమి వంటి కీలకమైన వనరులను వినియోగంచుకోవాలని సర్వే తెలిపింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు లాభదాయకమైన ఉపాధికి గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆర్థిక వృద్ధికి మరియు ఉపాధి కల్పనకు దోహదం చేయడానికి వ్యవసాయం యొక్క సామర్థ్యాన్ని భారతదేశం ఇంకా పూర్తిగా ఉపయోగించుకోలేదని సర్వే పేర్కొంది.
నీటి ఎద్దడి, వాతావరణ మార్పుల వల్ల ఉద్భవిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగంలో తీవ్రమైన నిర్మాణాత్మక పరివర్తన అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయ కూలీలు తిరిగి వాళ్ళ ఇళ్ళుచేరిన ( రివర్స్ మైగ్రేషన్) కారణంగా కోవిడ్ సంవత్సరాల్లో వ్యవసాయ ఉపాధి పెరగడం, 2024 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయంలో విలువను పెంచే వృద్ధి రేటు క్షీణించడం మరియు 2024 వేసవిలో దేశంలోని వాయవ్య మరియు మధ్య ప్రాంతాలలో అత్యంత వేడికారణంగా పెరుగుతున్న నీటి అవసరాల ఒత్తిడి మరియు శక్తి వినియోగంతో భారత వ్యవసాయ రంగ విధానాలను తీవ్రంగా మరియు నిజాయితీగా తయారుచేయడం అనివార్యమని సర్వే తెలిపింది.
వ్యవసాయ రంగానికి ఊతమివ్వడానికి ప్రైవేట్ రంగం పెట్టుబడులను పెంచడం అత్యవసరం అని ఆర్థిక సర్వే తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి పద్ధతులు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, పంట అనంతర నష్టాలను తగ్గించడం మొదలైన వాటిలో పెట్టుబడులు పెరగాలి. మౌలిక సదుపాయాలు మరియు ఆహార ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు, నిల్వ కాలవ్యవధిని పెంచడం ద్వారా రైతులకు మెరుగైన ధరలను నిర్ధారించవచ్చు.
ఆర్థిక సర్వే ప్రకారం 2022-23లో, ఆహార ధాన్యాల ఉత్పత్తి 329.7 మిలియన్ టన్నులకు చేరుకొని చరిత్రాత్మక స్థాయిని అందుకుంది, నూనె గింజల ఉత్పత్తి 41.4 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2023-24లో అల్ప వర్షపాతం, వానలు ఆలస్యం అయినకారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 328.8 మిలియన్ టన్నులకు తగ్గింది. 2015-16లో దేశీయంగా వంటనూనె 86.30 లక్షల టన్నుల నుండి 2023-24లో 121.33 లక్షల టన్నులకి పెరిగింది. నూనె గింజల మొత్తం విస్తీర్ణం 2014-15లో 25.60 మిలియన్ హెక్టార్ల నుండి 2023-24లో (17.5 శాతం వృద్ధితో )30.08 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. వంటనూనెకు దేశీయ డిమాండ్, వినియోగ ధోరణులు పెరిగినప్పటికీ వంటనూనె దిగుమతి శాతాన్ని 2015-16లో 63.2 శాతం నుండి 2022-23 నాటికి 57.3 శాతానికి తగ్గించింది.
తేటగీతి, July 22, 2024