రంగాల వారీ ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతానికి భారత్ – యుఎస్ టిపిఎఫ్ అంగీకారం

రంగాల వారీ ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతానికి భారత్ – యుఎస్ టిపిఎఫ్ అంగీకారం
రంగాల వారీ ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతానికి భారత్ – యుఎస్ టిపిఎఫ్ అంగీకారం

రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాన్ని తదుపరి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న తమ నిబద్ధత ను భారత్ – అమెరికా ఈ రోజు పునరుద్ఘాటించాయి. వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ , యు ఎస్ టిఆర్ రాయబారి కేథరీన్ తాయ్ మధ్య సమావేశంలో ఈ వైఖరిని స్పష్టం చేశారు.

రంగాల వారీగా ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతం చేసి రెండు వ్యూహాత్మక భాగస్వామ్య, ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను సురక్షిత, ప్రతిష్టాత్మక భవిష్యత్ దిశగా ముందుకు తీసుకు వెళ్ళాలని భారత్-యు ఎస్ టి పి ఎఫ్ ధృఢ నిర్ణయం తీసుకున్నాయి.

సంబంధాలలో నిబిడీకృతంగా ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి రెండు ఆర్థిక వ్యవస్థలను రంగాల వారీగా ఏకీకృతం చేయవలసిన ప్రాముఖ్యతను ఇద్దరు నాయకులు నొక్కిచెప్పారు.

ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాల ప్రతిష్టాత్మక భవిష్యత్ దిశగా మరింత కృషి చేయాలని, రెండు ఆర్థిక వ్యవస్థలు అంతర్లీన కారకాల నుంచి ప్రయోజనం పొందేందుకు వీలుగా దానిని తదుప రి స్థాయికి తీసుకెళ్లాలని నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఇండియా-యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ పాలసీ ఫోరం (టిపిఎఫ్) 12వ మంత్రుల స్థాయి సమావేశాన్ని భారత్-అమెరికా ఈ రోజు ఢిల్లీలో నిర్వహించాయి. వాణిజ్య సంబంధాల భవిష్యత్ కు ప్రతిష్టాత్మక, భాగస్వామ్య దార్శనికత ను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ఏడాది సెప్టెంబర్ 24 న జరిపిన సమావేశం లో ఈ లక్ష్యాన్ని ప్రకటించారు.

భారత వాణిజ్య, పరిశ్రమలు , జౌళి, వినియోగదారుల వ్యవహారాలు , ఆహార -ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ , యు.ఎస్ వాణిజ్య ప్రతినిధి, రాయబారి కేథరీన్ తాయ్ టిపిఎఫ్ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు.

రెండు దేశాల వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత, ఇంకా ఉత్పన్నం కాగల సమస్యలపై పూర్తి స్థాయి సమన్వయ చర్చల ప్రాముఖ్యాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారు.. ఇందుకు సంబంధించి వాణిజ్య అంశాలలో సమన్వయానికి , సహకారానికి , ద్వైపాక్షిక వాణిజ్య సమస్యల పరిష్కారానికి, ముఖ్యమైన , ఎదురవుతున్న వాణిజ్య విధాన సమస్యలను గుర్తించడానికి టిపిఎఫ్ ను ప్రధాన వేదిక గా గుర్తించారు.

ఇండియా -యుఎస్ఎ టిపిఎఫ్ 2021 చర్చల ముఖ్యాంశాలు …

ద్వైపాక్షిక వాణిజ్య విషయాలు

వ్యవసాయం, వ్యవసాయేతర వస్తువులు, సేవలు, పెట్టుబడులు ,మేధో సంపత్తిపై టిపిఎఫ్ వర్కింగ్ గ్రూపులను పరస్పరం ప్రయోజనకరమైన రీతిలో ఇరుపక్షాల పరస్పర ఆందోళన సమస్యలను పరిష్కరించడానికి, తరచుగా కలవడానికి క్రియాశీలం చేయాలి.

ద్వైపాక్షిక మర్కండైజింగ్ ట్రేడ్ లో గత ఏడాది జనవరి – సెప్టెంబర్ మధ్య నమోదు అయిన దాదాపు 50 శాతం వృద్ధిని ఈ ఏడాది ఇదే కాలంలో బలమైన పునరుద్ధరణపై సంతృప్తి వ్యక్తం అయింది. ప్రస్తుత సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించడానికి సిద్ధంగా ఉంది.

సానుకూల వ్యాపార వాతావరణాన్ని ఏర్పరచ వలసిన అవసరాన్ని అంగీకరించారు. బీమా రంగంలో ఎఫ్ డిఐని సరళీకృతం చేయడం, ఆదాయపు పన్నులో రెట్రోస్పెక్టివ్ నిబంధనను తొలగించడం, పెట్టుబడిని సులభతరం చేయడానికి “సింగిల్ విండో సిస్టమ్”ను ప్రారంభించడం తో సహా భారతదేశం రూపొందించిన ఆర్థిక సంస్కరణలను ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు.

మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యాల మధ్య పారదర్శకమైన, నియమాల ఆధారిత ప్రపంచ వాణిజ్య వ్యవస్థల భాగస్వామ్య దార్శనికతను సాధించడానికి డబ్ల్యుటివో, జి20 మొదలైన వాటితో సహా వివిధ బహుళపక్ష వాణిజ్య సంస్థలలో సహకారం, నిర్మాణాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం.

స్థితిస్థాపక, సురక్షిత సరఫరా వ్యవస్థలను సృష్టించడం పై దృష్టి. ఈ విషయంలో భారత్-అమెరికా కలసి వాణిజ్యం , సాంకేతికత మొదలైన కీలకమైన రంగాలలో సురక్షిత సరఫరా గొలుసులను అభివృద్ధి చేయడంలో భావ సారూప్య భాగస్వాములతో కలిసి పనిచేయవచ్చు.

ఆరోగ్య రంగంలో సహకారం ప్రాముఖ్యాన్ని భారత్ ప్రస్తావించింది. ప్రపంచ సరఫరా గొలుసుల ను పెంపొందించడానికి ఒక భద్రమైన ఫార్మాస్యూటికల్ తయారీ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంలో అమెరికా, మిత్ర దేశాలతో భాగ స్వామ్యం నెరపడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది.

కీలకమైన రంగాలలోనూ (సైబర్ స్పేస్, సెమీకండక్టర్లు, ఎఐ, 5జి, 6జి ,భవిష్యత్ తరం టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీతో సహా), స్థితిస్థాపక ,సురక్షితమైన ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలోనూ రెండు దేశాలలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరియు సహకారానికి ప్రాధాన్యత ఇస్తుంది.

నిరంతర చొరవ తో మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించడం ద్వారా రెండు దేశాల రైతుల, వ్యాపారాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం.

మామిడి పండ్లు ,దానిమ్మపండ్లు, భారతదేశం నుండి దానిమ్మ అరిల్స్, ,యునైటెడ్ స్టేట్స్ నుంచి జంతువుల మేత కోసం చెర్రీలు, అల్ఫాల్ఫా గడ్డి కోసం మార్కెట్ యాక్సెస్ సదుపాయంపై ఒప్పందం.

భారతదేశం నుండి ద్రాక్ష ,యుఎస్ఎ నుండి పంది మాంసం/ పంది మాంసం ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ పరిష్కరించడానికి అంగీకార

యుఎస్ నుండి సోల్యుబుల్స్ తో డిస్టిల్లర్స్ ఎండిన ధాన్యాలు, భారతదేశం నుండి నీటి గేదె మాంసం, వైల్డ్ క్యాచ్ రొయ్యల కు మెరుగైన మార్కెట్ ను అన్వేషించడంపై రెండు దేశాలు చొరవను కొనసాగిస్తాయి.

ఐపి రక్షణ ప్రాముఖ్యత, సృజనాత్మకత కు ప్రోత్సహం తో పాటు ఐపి-ఇంటెన్సివ్ పరిశ్రమల్లో ద్వైపాక్షిక వాణిజ్యం,పెట్టుబడులకు గుర్తింపు

భవిష్యత్ కార్యాచరణ

జిఎస్ పి (సాధారణీకరించబడిన ప్రాధాన్యతల వ్యవస్థ) ప్రయోజనాల పునరుద్ధరణ ప్రాముఖ్యతను భారతదేశం ప్రస్తావించింది. ఇది రెండు వైపుల నుండి పరిశ్రమలు తమ సరఫరా గొలుసులను సమర్థవంతంగా సమీకృతం చేయడానికి సహాయపడుతుంది. అమెరికా దీనిన తగిన పరిగణనకు అంగీకరించింది.

డిజిటల్ సేవలతో సహా సేవల ప్రాముఖ్యత, ద్వైపాక్షిక సేవల వాణిజ్యం,పెట్టుబడులను పెంచడానికి గణనీయమైన అవకాశాలు .

ద్వైపాక్షిక ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే విధంగా రెండు దేశాల మధ్య వృత్తి పరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులు, పెట్టుబడిదారులు, వ్యాపార ప్రయాణికుల రాకపోకలను, కార్యకలాపాలకు గుర్తింపు.

రెండు వైపుల నుండి కార్మికుల ప్రయోజనాల కోసం సామాజిక భద్రతా టోటలైజేషన్ ఒప్పందంపై చర్చలు జరపడం, ఆ ఒప్పందాన్ని కొనసాగించడంపై తదుపరి చర్యల ప్రాముఖ్యతపై అంగీకారం.

పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి టిపిఎఫ్ నిరంతరం దృఢమైన ఫలితాలను అందించాలని నిర్ణయించారు.

2022 మార్చి నాటికి జరిగే ఇంటర్ సెషన్ టిపిఎఫ్ సమావేశానికి ఖరారు చేయగల నిర్దిష్ట వాణిజ్య ఫలితాలను గుర్తించడంతో సహా గణనీయమైన పురోగతి సాధించడానికి కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయాలని టిపిఎఫ్ వర్కింగ్ గ్రూపులను ఆదేశించారు.

November 23, 2021