

న్యూఢిల్లీ: ఖేల్ రత్న అవార్డు ను మేజర్ ధ్యాన్ చంద్ పేరు తో వ్యవహారం లోకి తీసుకు రావాలని భారతదేశం వ్యాప్తంగా పౌరుల వద్ద నుంచి తనకు ఎన్నో అభ్యర్థన లు వస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల ఈ భావనల ను గౌరవిస్తూ ఖేల్ రత్న అవార్డు ను ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుందని ఆయన చెప్పారు.
భారతదేశాని కి గౌరవాన్ని సాధించి పెట్టి, గర్వకారణంగా నిలచిన, దేశం లో అందరికన్నా ముందుగా చెప్పుకొనేటటువంటి క్రీడాకారుల లో ఒకరు గా మేజర్ ధ్యాన్ చంద్ ఉన్నారు ప్రధాన మంత్రి అన్నారు. మన దేశం లో అత్యున్నతమైనటువంటిదైన క్రీడా సమ్మానానికి ఆయన పేరు ను పెట్టడం యోగ్యమైనదే అన్నారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో:
‘‘ పురుషుల మరియు మహిళల హాకీ జట్ల అపూర్వమైన ఆట తీరు యావత్తు దేశం దృష్టి ని తన వైపునకు తిప్పివేసుకొంది. హాకీ క్రీడ పట్ల భారతదేశం నలు మూలల ఆసక్తి మరొక్క సారి రేకెత్తుతోంది. ఇది రాబోయే కాలాల కు ఎంతో సకారాత్మకమైనటువంటి సంకేతం అని చెప్పాలి
ఖేల్ రత్న పురస్కారాని కి మేజర్ ధ్యాన్ చంద్ పేరు ను పెట్టాలంటూ భారతదేశం నలుమూలల పౌరుల వద్ద నుంచి నాకు అభ్యర్థన లు అనేకం గా అందుతున్నాయి. వారి అభిప్రాయాల ను తెలియజేసినందుకు నేను ధన్యవాదాలను వ్యక్తం చేస్తున్నాను.
వారి భావనల ను గౌరవిస్తూ, ఖేల్ రత్న అవార్డు ను ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని వ్యవహరించడం జరుగుతుంది.
జయ్ హింద్.
మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశం లో అందరి కన్నా ముందుగా చెప్పుకొనే క్రీడాకారుల లో ఒకరు గా ఉన్నారు. ఆయన భారతదేశానికి గౌరవాన్ని, ప్రతిష్ట ను సంపాదించి పెట్టారు. మన దేశం లో అత్యున్నతమైందైన క్రీడా సమ్మానానికి ఆయన పేరు ను పెట్టడం సముచితమైందే అవుతుంది.
ఒలింపిక్ క్రీడోత్సవాల లో భారతీయ క్రీడాకారుల అద్భుత ప్రయత్నాలు మనకు అందరికీ తెలిసినవే. ప్రత్యేకించి హాకీ లో మన పుత్రులు, పుత్రికలు ఏ విధం గా అయితే వారి సంకల్ప శక్తి ని చాటారో, గెలుపు పట్ల ఏ విధమైన లాలస ను అయితే ప్రదర్శించారో.. వర్ధమాన తరాని కి, రాబోయే తరాల వారి కి అవి చాలా పెద్ద ప్రేరణ ను అందిస్తాయి.
దేశాన్ని గర్వపడేటట్లు చేసిన క్షణాల నడుమ ఎంతో మంది దేశ వాసులు మనవి చేసింది ఏమిటి అంటే ఖేల్ రత్న పురస్కారాని కి ఇక మేజర్ ధ్యాన్ చంద్ గారి పేరు ను పెట్టాలి అనేదే. ప్రజల భావనల ను దృష్టి లో పెట్టుకుని, దీని పేరు ను ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం గా చేయడం జరుగుతోంది.
ఆగష్టు 07, 2021