కోవిడ్ ఉద్యోగులలో రేపిన కలకలం

కోవిడ్ ఉద్యోగులలో రేపిన కలకలం
కోవిడ్ ఉద్యోగులలో రేపిన కలకలం

కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసి వారిని మానసిక ఆందోళనకు గురిచేసింది. ఇటీవల ప్రపంచ ఆర్ధిక ఫోరం ఆధ్వర్యంలో ఇప్సాస్ (Ipsos) జరిపిన ఒక అధ్యయనంలో 56శాతం మంది కరోనా వైరస్ వల్ల ఉద్యోగాలలో నిలకడలేక మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలిపారు.

28 దేశాలలో దాదాపు 13,000 మంది ఉద్యోగులతో జరిపిన ఈ సర్వేలో కరోనా మహామ్మారి ప్రతీవారనీ ఏదోవిధంగా ఇబ్బంది పెట్టినట్టు తేలింది. కొంతమంది ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తే, మరికొంతమంది ఉద్యోగాలను కోల్పోవల్సి వచ్చింది. ఇక కొందరు స్వచ్ఛందంగానే తమ ఉద్యోగాలను వదులుకుని కుటుంబాలతో గడిపారు. దాదాపు 52శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేశారని తేలింది. మహమ్మారి ఉధృతికి అనుగుణంగా ఉద్యోగుల పనితీరులో కూడా తీవ్ర మార్పులు సంభవించాయి. పరిస్థితుల దృష్ట్యా పనివేళలలో ఎగుదిగుడులతో కనీసం 44శాతం మంది ఉద్యోగులు తెల్లవారుజామున గానీ, అర్ధరాత్రిగానీ పని చేయాల్సి వచ్చిందని తెలిపారు. 46శాతం మంది ఇంటి వద్ద సరైన వసతులు లేక ఇబ్బంది పడ్డామని చెప్పగా, 49శాతం మంది ఒంటరితనం తమని వేధించిందని వాపోయారు. మానసిక ఆందోళనల వల్ల పనిలో 46శాతం ఉత్పాదకత తగ్గిందని సర్వేలో తేలింది.

ఇక భారతదేశానికి వస్తే –

  • ప్రపంచ వ్యాప్తంగా 32శాతం మంది ఉద్యోగుల ఎక్కువ పనిగంటలు పనిచేయగా, ఇందులో 59శాతం మంది మనదేశంలోనే ఉన్నారు. అలాగే పనిగంటలు తగ్గించుకున్నవారి సంఖ్య కూడా మనదేశంలోనే (52శాతం) ఎక్కువ.
  • కాగా ఇలా ఎక్కువ పనిచేసిన వారిలో కనీసం 39శాతం మంది తాము ఇష్టపూర్వకంగానే పనిగంటలు పెంచుకున్నామని తెలిపారు.
  • ప్రపంచంలో 15శాతం మంది స్వచ్ఛందగా తమ ఉద్యోగాలను వదులుకోగా వారిలో 33శాతం మంది మన దేశానికి చెందినవారే కావటం గమనార్హం.
  • ఉద్యోగం కోల్పోతేమోనన్న భయం మనదేశంలో 22శాతం మందిలో మాత్రంమే కన్పించగా, అదే 74శాతం మంది మలేషియన్లు భయాందోళనకు గురైయ్యారు.

 

తేటగీతి