రాగ గీతిక 7 మధ్యమావతి (22వ మేళకర్త ఖరహరప్రియ జన్యం)

రాగాలాపన, స్వరకల్పన, నెరవు కలిగిన శుభప్రదమైన రాగం మధ్యమావతి. కర్ణాటక సంగీత కచేరీలలో ఏవైనా అపస్వరా దోషాలు దొర్లితే, దోష నివారణకు చివర్లో ఈ రాగాన్ని పాడటం ఒక సాంప్రదాయంగా ఉంది. 22వ మేళకర్త ఖరహరప్రియ దీని జన్య రాగం. ఇది ఉపాంగ, ఔడవ- ఔడవ రాగం. మధ్యమావతి శ్రీరాగానికి అతి దగ్గరగా ఉంటుంది.

ఈ రాగం స్వర స్థానాలు: షడ్జమం, చతుశ్శ్రుతి రిషభం, శుద్ధమధ్యమం, పంచమం, కైశికి నిషాదం (స,రి,మ,ప,ని,స / S R2 M1 P N2 S) ఆరోహణ,అవరోహణ రెండింటిలోను గాంధారం, దైవతం వర్జ్యస్వరాలు. ఋషభ నిషాద మధ్యమములు జీవస్వర న్యాసస్వరములు.
మధ్యమావతి రాగము ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే రాగము. రైతులు సేద్యం చేస్తూ పాడుకొని జానపదాలలో ఈ రాగము ఎక్కువగా కనపడుతుంది. మేఘాలు ముసిరేటి వేళ ఈ రాగము వినటానికి, పాడుకొనటానికి చాలా బాగుంటుంది. ప్రణయ సంకేతానికి కూడా ఈ రాగము చాలా విశిష్టమైనది. ఈ రాగాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాడదగినది.

ఈ రాగములో ప్రసిద్ధిగాంచిన కీర్తనలు:

1. అదివో అల్లదివో – అన్నమాచార్య కీర్తన
2. పిడికెడ తలంబ్రాల పెండ్లి కూతురు – అన్నమయ్య
3. కలియుగం – అన్నమయ్య
4. చూడరమ్మ సతులాల – అన్నమయ్య
5. నీ నామమో – అన్నమయ్య
6. భాగ్యద లక్ష్మి బారమ్మా – పురందర దాసు
7. రామ కథా సుధా – త్యాగయ్య
8 అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా – త్యాగరాజు కీర్తన
9. రామా నను బ్రోవగరాదా – రామదాసు కీర్తన.
10. నిను పోనిచ్చెదనా సీతారామ – రామదాసు కీర్తన.
11. పాహి రామ ప్రభో పాహి రామప్రభో – రామదాసు కీర్తన.
12. ఓ రఘువీరా యని నే పిలిచిన – రామదాసు కీర్తన.
13. రామ సుధాంబుధి ధామ రామ నాపై – రామదాసు కీర్తన.
14. ధర్మసంవర్ధిని – ముత్తుస్వామి దీక్షితార్
15. పలికించు కామాక్షి – శ్యామ శాస్త్రి
16. రామాభిరామ – మైసూర్ వాసుదేవచారి
17. గోవిందా మిహ గోపీనంద – నారాయణ తీర్థులు

ఈ రాగములో ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా పాటలు:

1. సీతారాముల కల్యాణం చూతము రారండి – సీతారామ కల్యాణం
2. సువ్వి సువ్వి సువ్వాలమ్మ – స్వాతి ముత్యం
3. నేడే ఈ నాడే – భలే తమ్ముడు
6. వరించి వచ్చిన మానవ వీరుడు – జగదేక వీరుని కథ
5. శరణం అయ్యప్ప – స్వామీ అయ్యప్ప
6. మమతల పెరిగిన నా తండ్రి – తల్లా? పెళ్ళామా?
7. కాశికి పోయాను రామా హరే – అప్పుచేసి పప్పు కూడు
8. వరాల బేరమయ్య – శ్రీవేంకటేశ్వర మహత్యం
9. సోజా రాజ్కుమారి సోజా – అనార్కలి
10. పడ్డానండి ప్రేమలో మరి – స్టూడెంట్ నం. 1
11. కలకలవిరిసి జగాలే పులకించెనే – శభాష్ రాముడు
12. సమయానికి తగు సేవ సేయనీ – సీతయ్య
13. లేచింది నిదుర లేచినది మహిలా లోకం – గుండమ్మ కథ
14. చెయ్యి చెయ్యి కలుపుద్దాం – చెంచులక్ష్మి
15. పండు వెన్నెల్లో ఈ వేణు గానం – జానకి వెడ్స్ శ్రీరాం
16. ఇదియే హాయి కలుపుము చెయ్యి – రోజులు మారాయి
17. ప్రియే చారుశీలే – మేఘసందేశం / భక్త జయదేవ
18. అనగనగా ఆకాశం ఉంది – నువ్వే కావాలి
19. చీటికి మాటికి చీటి కట్టి – భలే అమ్మాయిలు
20. ఆకాశ వీధిలో అందాల జాబిలి – మాగల్య బలం
21. శంకరా.. నాద శరీర – శంకరాభరణం
22. భంభం భోలే – ఇంద్ర
23. రావమ్మ మహాలక్ష్మి (కడివెడు నీళ్ళు కల్లాపి జల్లి)- ఉండమ్మ బొట్టు పెడతా

హిందుస్తానీ సంగీతంలో మధ్యమావతికి సమాన రాగం మధుమాద్ సారంగ్ రాగం. హింది సినిమా పాటలలో ఈ రాగములో అనేక పాటలు వెలువడ్డాయి. వాటిలో ప్రాచుర్యం పొందిన కొన్ని పాటలు:

1. ఆ లౌట్ కే ఆజా మేరి మీత్ – రాణీ రూప్ మతి
2. దయ్యెరె దయ్యరే చడ్ గయి పాపీ బుచువా – మధుమతి
3. ముఝే నీద్ నా ఆయే – దిల్
4. చోరి చోరి దిల్ క లాగాన బురి బాత్ హై – బడా భై
5. చడ్ తీ జవానీ మేరి చాల్ మస్తానీ – కర్వాన్
6. దుఖ్ భర్ దిన్ గయే – మదర్ ఇండియ
7. మత్వాల జియా డోలే – మదర్ ఇండియ
8. హోలీ ఆయీ రే – మదర్ ఇండియ
9. ఆజ్ మేరి మన్ మే అఖీ – ఆన్
10. రంగ్ లో ఆజ్ – కోహీనూర్
11. రాత్ సుహానీ ఝూమే జవానీ – రాణీ రూప్ మతి
12. హం దోనో దో ప్రేమీ – అజ్ఞబీ
13. మేఘా నే బోలే చన్ చన్ – దిల్ దేఖే దేఖో

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *